MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య

Pawan Kalyan: పవర్ స్టార పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖను కన్నతల్లికి సమానంగా గౌరవిస్తాడు. సురేఖ కూడా పవర్ స్టార్ ను తన పిల్లల మాదిరిగానే చూసుకుంది. కానీ సురేఖ పవన్ కళ్యాణ్ కు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? వదిన ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2026, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కన్నతల్లిలా చూసుకున్న సురేఖ..
Image Credit : X/pawan kalyan fans

కన్నతల్లిలా చూసుకున్న సురేఖ..

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరిగిన టైమ్ కు పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు. దాంతో పవన్ ను కూడా చిరంజీవితో కలిసి చెన్నైలోనే ఉండేవాడు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ ను కన్న కోడుకులా చూసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా తన పిల్లలో సమానంగా పవర్ స్టార్ ను ఆమె ప్రేమించేది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సురేఖను తల్లితో సమానంగా చూసుకుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా సురేఖ తీసుకున్న నిర్ణయమే. ఆమే పవన్ కళ్యాణ్ ను హీరోను చేయాలని చిరంజీవితో చెప్పి పట్టుబట్టి ఒప్పించిందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వదిన ద్రోహం చేసిందని పవన్ ఎందుకన్నాడు..
Image Credit : X/pawan kalyan fans

వదిన ద్రోహం చేసిందని పవన్ ఎందుకన్నాడు..

వదిన సురేఖ తనకు ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కూడా నటించారు.ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేశారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్‌ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అని అడినప్పుడు భయమేసింది. తాను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది.

Related Articles

Related image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Related image2
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
35
వదిన వల్లే ఇక్కడ ఉన్నాను..
Image Credit : Asianet News

వదిన వల్లే ఇక్కడ ఉన్నాను..

ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్‌ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్‌ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని కామెంట్స్ చేశారు. తన ఎదుగుదలకు వదిన తీసుకున్న నిర్ణయమే కారణం అని పవన్‌ కళ్యాణ్‌ ఫన్నీ వేలో క్లారిటీ ఇచ్చారు.

45
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం
Image Credit : facebook/chiranjeevi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం

1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ ప్రయాణం ప్రారంభమైంది. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను, సొంత మేనరిజమ్స్‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. పలు నివేదికల ప్రకారం ఆయన ఒక్కో సినిమాకు ₹50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

55
రాజకీయ ప్రయాణం - డిప్యూటీ సీఎంగా పవన్
Image Credit : stockPhoto

రాజకీయ ప్రయాణం - డిప్యూటీ సీఎంగా పవన్

2008లో చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయారంగేట్రం చేసిన పవన్.. 2014లో 'జనసేన' పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఓటములు ఎదురైనా కుంగిపోకుండా, ప్రజా సమస్యలపై నిలకడగా పోరాడారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసిన జనసేన, పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved