MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా

RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఆర్జే చరణ్ రీ ఎంట్రీ ఇచ్చారు. తొలి వారం లోనే చరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. చరణ్ రీ ఎంట్రీ ఎలా జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

3 Min read
Author : Tirumala Dornala
Published : Sep 17 2026, 11:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు 10లో 11వ రోజు సర్ప్రైజ్ అదిరింది. తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన ఆర్జే చరణ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ వివరాలతో పాటు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లెవల్ 2 హైలైట్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు వర్షిణి హౌస్ లో హైలైట్ అయింది. వర్షిణి హౌస్ లో కొన్ని రోజులుగా ముకేశ్ తో క్లోజ్ గా మూవ్ కావడం అంతా గమనిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముఖేష్,వర్షిణి లవ్ ట్రాక్
Image Credit : Asianet News

ముఖేష్,వర్షిణి లవ్ ట్రాక్

దీనితో నరేష్, అమన్ లతో ఆమె సరదాగా మాట్లాడుతున్నప్పుడు ముకేశ్ గురించి ప్రస్తావన వచ్చింది. ముఖేష్ ని లవ్ చేస్తున్నారా.. అతడు మీకు లవరా లేక ఫ్రెండా అని నరేష్ ముఖం మీదే అడిగేశాడు. షాలిని సిగ్గు పడుతూ మీకైనా పిచ్చా అలాంటిది ఏమీ లేదు అని చెప్పింది. అయితే ముఖేష్ నే అడిగి తెలుసుకుంటా అని నరేష్ చెప్పాడు. ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ముఖేష్.. వర్షిణికి తెలియకుండా మీ వెనుకే కూర్చుని ఉన్నాడు. సడెన్ గా అతడు ఆమెని టచ్ చేయడంతో వర్షిణి భయపడింది. ఆ తర్వాత సిగ్గుతో నవ్వేసింది.

35
దేబ్జానీ కష్టపడింది కానీ..
Image Credit : Asianet News

దేబ్జానీ కష్టపడింది కానీ..

కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లెవల్ 2 కోసం త్రిగుణ్,రామ్ ప్రసాద్, దేబ్జానీ పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో మొదటి ఘట్టాన్ని త్రిగుణ్, రామ్ ప్రసాద్ కంటే ముందుగా దేబ్జానీ కంప్లీట్ చేసింది. కానీ రెండవ ఘట్టంలో ఆమె వెనుకబడింది. దీనితో కెప్టెన్సీ కంటెండర్ గా ఆమె అవకాశం కోల్పోయింది. ఇంతలో యమలోకంలో ఉండే భటుల గెటప్ లో కొందరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు హౌస్ లోకి వేస్తె ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని హౌస్ మేట్స్ భావించారు.

45
చరణ్ రీ ఎంట్రీ, అతడికి స్పెషల్ పవర్
Image Credit : Asianet News

చరణ్ రీ ఎంట్రీ, అతడికి స్పెషల్ పవర్

వాళ్ళ అనుమానాన్ని నిజం చేస్తూ షాలిని చేయి పట్టుకుని గేట్ వరకు తీసుకెళ్లారు. షాలిని అయితే తాను నిజంగా ఎలిమినేట్ అయ్యానా అంటూ భయపడిపోయింది. కానీ భటుల గెటప్ లో ఉన్న వారు ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. షాలిని చేయి పట్టుకుని ఉన్న వ్యక్తి మాత్రం లోపలే ఉండిపోయాడు. ఇతడు ఎవరా అని షాలిని అతడి మాస్క్ తొలగించి చూడగా.. బిగ్ సర్ప్రైజ్.. హౌస్ లోకి ఆర్జె చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ ని ఆప్యాయంగా కలుసుకున్న చరణ్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈసారి ఇంకా సీరియస్ గా గేమ్ ఆడతానని హామీ ఇచ్చాడు. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న వారిలో ఒకరిని నేరుగా తొలగించవచ్చు లేదా ఒకరిని ఎంచుకుని వాళ్ళతో పోటీ పడి గెలిస్తే వాళ్ళని తప్పించి కెప్టెన్సీ కంటెండర్ కావచ్చు.

55
పరువు తీసుకున్న రామ్ ప్రసాద్
Image Credit : Asianet News

పరువు తీసుకున్న రామ్ ప్రసాద్

ఈ రెండు ఆప్షన్స్ లో చరణ్ పోటీ పడేందుకే మొగ్గు చూపాడు. తనకి పోటీగా త్రిగుణ్ ని ఎంచుకున్నాడు. వీళ్ళ పోటీకి బిగ్ బాస్ రామ్ ప్రసాద్ ని సంచాలక్ గా నియమించారు. ఆ గేమ్ రూల్స్ అర్థ కాకపోవడంతో. తాను సంచాలక్ గా ఉండలేనని, గేమ్ రూల్స్ అస్సలు అర్థం కాలేదని రామ్ ప్రసాద్ లబోదిబోమన్నారు. కానీ బిగ్ బాస్ కంగారు పడవద్దని రూల్స్ రాసి ఉన్న బోర్డు చూపించారు. అయినా కూడా రామ్ ప్రసాద్ కి ఆ రూల్స్ అర్థం కాలేదు. రామ్ ప్రసాద్ కి మాత్రమే కాదు హౌస్ లో ఉన్న ఎవరికీ రూల్స్ సరిగ్గా అర్థం కాలేదు. గేమ్ ప్రకారం వివిధ కలర్స్ లో ఉన్న టైల్స్ ని నిచ్చెనకి అమర్చాలి. కానీ రూల్స్ అర్థం కాకపోవడం తో రామ్ ప్రసాద్ ముందుగా చరణ్ గెలిచినట్లు ప్రకటించారు. బిగ్ బాస్ కలగజేసుకుని.. చరణ్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యాడా అని ప్రశ్నించాడు. అందుకే బిగ్ బాస్ నేను సంచాలక్ గా ఉండను అని చెప్పింది అంటూ రామ్ ప్రసాద్ మరోసారి లబో దిబోమన్నాడు. రూల్స్ క్లియర్ గా తెలుసుకుని త్రిగుణ్ విజేతగా నిలిచిచినట్లు ప్రకటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju Salary: ఒకప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో.. మమితా బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image3
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Related Stories
Recommended image1
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved