- Home
- Entertainment
- అసలుకే చిన్న లాగు అందులోనూ టైట్ ఫిట్... అలా కనిపించి యంగ్ బ్యూటీ శివాత్మిక ఏం చెప్పాలనుకుంటుందో!
అసలుకే చిన్న లాగు అందులోనూ టైట్ ఫిట్... అలా కనిపించి యంగ్ బ్యూటీ శివాత్మిక ఏం చెప్పాలనుకుంటుందో!
హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక స్టార్ హీరోయిన్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం అంటుంది. నేరుగా చెప్పుకున్నా శివాత్మిక సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది.

Shivathmika Rajashekar
చిన్ని లాగులు ధరించి పబ్లిక్ లో చక్కర్లు కొడుతున్న శివాత్మిక ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటుందో అర్థం కావడం లేదు. ఆమె లక్ష్యం మాత్రం దర్శక నిర్మాతలే అని తెలుస్తుంది. హోమ్లీ పాత్రలే కాదు గ్లామర్ పాత్రలకు కూడా సూట్ అవుతానని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుండవచ్చు.
Shivathmika Rajashekar
ఐతే ఆమె కోరుకున్న ఇమేజ్ ఇంకా దక్కలేదు. విడుదలైంది ఒక్క సినిమా అందులోనూ హోమ్లీ రోల్. ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో కూడా అలాంటి పాత్రలే చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. అయితే ఆమెకు కనీస గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ మెల్లగా పుంజుకుంటుంది. శివాత్మిక ఓ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. శివాత్మిక డెబ్యూ మూవీ దొరసాని విడుదలై మూడేళ్లు దాటిపోయింది.
Shivathmika Rajashekar
2019లో విడుదలైన దొరసాని పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. దొరసాని చిత్రం తర్వాత శివాత్మికకు నటిగా మంచి పేరు తెచ్చుకుంది. శివాత్మిక ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఆకాశం టైటిల్ తెలుగులో విడుదల కానుంది.
Shivathmika Rajashekar
ఇక తెలుగులో దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.
Shivathmika Rajashekar
ఇక హీరోయిన్ కలర్స్ స్వాతి కం బ్యాక్ మూవీ పంచతంత్రం. ఈ మూవీలో కూడా శివాత్మిక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా వెలిగిపోవాలని కలలుకంటున్న శివాత్మిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తున్నారు.
తెలుగులో కంటే తమిళంలోనే ఆమెకు ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. టాలీవుడ్ లో కనీసం టైర్ టూ హీరోల ప్రక్కన కూడా ఆమెకు ఛాన్సెస్ రావడం లేదు. తెలుగు హీరోయిన్స్ పై ఎప్పటి నుండో వివక్ష కొనసాగుతుండగా, శివాత్మిక విషయంలో కూడా అదే జరుగుతుంది.