బిగ్ బాస్ సీజన్ 7 ఆఫర్ నిజమే కాని.. హీరోయిన్ మాధవీ లత కామెంట్స్ వైరల్..
కాంట్రవర్సీ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ లా మారింది హీరోయిన్ మాధవి లత. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఆమె.. ఆతరువాత కొన్నివాదాలతో హైలెట్ అయ్యింది. తాజాగా బిగ్ బాస్ ఆఫర్ గురించి వెల్లడించింది బ్యూటీ.

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది హీరోయిన్ మాధవి లత. రవిబాబు తెరకెక్కించిన నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆతరువాత నానీతో స్నేహితుడు, అరవింద్ 2 లాంటిసినిమాల్లో నటించిమెప్పించింది. కాని ఆసినిమాలు ఆడలేదు.. ఆతరువాత ఈ హీరోయిన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం పొలిటిక్ కెరీర్ ను కొనసాగిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులతో టచ్‌లో ఉంటోంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. అంతే కాదు ఇంటర్వ్యూలలో ఇండస్ట్రీ గురించి కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ.. కాస్టింగ్ కౌంచ్ గురించి కూడా సంచలన ప్రకటణలు చేస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ ఐటమ్ అవుతుంటుంది మాధవీ లత.
అయితే ప్రతీ సారి బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో..మాధవి లత పాల్గొంటుంది అంటూ..న్యూస్ వైరల్ అయ్యేది. కాని ఏ సీజన్ లో కూడా ఆమె పాల్గొననది లేదు. ఇక ఈసారి కూడా సీజన్ 7 లో మాధవి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తోంది అంటూ వార్త హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ విషయం పై స్పందించింది మాధవీ లత. స్పందించడమే కాదు..క్లారిటీ కూడా ఇచ్చింది.
బిగ్ బాస్ రియాలిటీ షో కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడో సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లను ఎంపిక పనిలో ఉంది బిగ్‌బాస్ బృందం. ఈ క్రమంలో.. ఈ షోలో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా .. మాధవీలతను సంప్రదించారట టీమ్. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. వాళ్లు మూడు సార్లు అఫీషియల్‌గా కలిసినట్లు చెప్పుకొచ్చింది.
మాధవీలతను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించారు అని ఓ నెటీజెన్ పెట్టిన ఫోస్ట్ ను షేర్ చేసిన మాధవీ లత.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా ఫాలోవర్స్ అందరికి ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరు ఈ పోస్ట్ ను క్రియేట్ చేశారో తెలియదు. అయితే అది నిజమే. బిగ్‌బాస్ సీజన్ 7 కోసం టీమ్ నన్ను సంప్రదించింది. అయితే ఇదే మొదటి సారు కాదు.. ఇప్పటి వరకు మూడు సార్లు వాళ్లు నాకు బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారు అని క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.
<p style="text-align: justify;">అంతే కాదు ఫైనల్ టచ్ ఇస్తూ `ఇప్పుడు నా ఫేస్‌బుక్ కుక్కలకు ముక్కల పండగ.. ఇప్పుడు మొరగండి అంటూ` కామెంట్ చేసింది. అయితే మాధవీ లత పోస్ట్ మీద స్పందించిన చాలా మంది వర్మ జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ కోసం మాత్రమే ఇలా చేశాడని, అతడిని సీరియస్‌గా తీసుకోవద్దని కామెంట్ చేశారు.</p>
అయితే.. ఆ ఆఫర్స్‌ను నేను సున్నితంగా తిరస్కరించాను. ఇక నాకు వ్యక్తిగతంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని లేదు. నన్ను షో లో పాల్గొనాలని కోరినందుకు బిగ్‌బాస్ టీమ్‌కు చాలా థ్యాంక్స్. అని మాధవీ లత అంది. దాంతో సోషల్ మీడియా ప్రచారంలో అబద్దం లేదు కాని.. తాను మత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లను అని నిఖ్కచ్చిగా చెప్పేసింది మాధవీ లత.