టైట్ టాప్ లో దగ్గరగా అందాలు చూపిస్తూ పిచ్చెక్కించిన అనన్య... తెలుగు హీరోయిన్ నుండి ఊహించని యాంగిల్!
లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ళ ది బాలీవుడ్ రేంజ్ గ్లామర్. నిలువెత్తు అందాలు పోత పోసినట్లు ఉండే ఈ చిన్నది సోషల్ మీడియా వేదికగా పరువాల ప్రదర్శన చేస్తుంది. అందుకు ఓ కారణం కూడా ఉందట.
Ananya Nagalla
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనన్య నాగళ్లను యాంకర్ ప్రశ్న అడిగారు. మీరు ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ ఎందుకు చేసుకున్నారనగా... గతంలో నేను హోమ్లీ ఫోటో షూట్స్ చేసేదాన్ని. శాకుంతలం మూవీ విడుదల అనంతరం ఓ హాట్ ఫోటో షూట్ చేశాను. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అందుకే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్నానని ఓపెన్ అయ్యింది.
Ananya Nagalla
శాకుంతలం మూవీలో అనన్య చెలికత్తె పాత్ర చేసింది. సమంత పక్కన ఉండే కీలక పాత్రలో కనిపించింది. శాకుంతలం డిజాస్టర్ కావడంతో అనన్య కెరీర్ కి ఆ మూవీ ఉపయోగపడలేదు.
Ananya Nagalla
అనన్య కెరీర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మొదలైంది. ఇన్ఫోసిస్ సంస్థలో పని చేస్తూనే ఆమె షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆమె నటించిన షాదీ అనే షార్ట్ ఫిల్మ్ ప్రశంసలు అందుకుంది.షాదీ షార్ట్ ఫిలింలో నటనకు బెస్ట్ యాక్ట్రెస్ గా అనన్య సైమా అవార్డు అందుకోవడం విశేషం.
Ananya Nagalla
సినిమా ప్రయత్నాలు చేస్తున్న అనన్యకు మల్లేశం చిత్రంలో ఆఫర్ వచ్చింది. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం తెరకెక్కింది. ప్రియదర్శి భార్య పాత్రలో అనన్య నటించింది.
అనన్య కెరీర్లో వకీల్ సాబ్ భారీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. అంజలి, నివేదా థామస్ తో పాటు అనన్య ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిగా నటించింది.
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా విడుదలైన వకీల్ సాబ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ గెస్ట్ రోల్ చేసింది. వకీల్ సాబ్ తో విజయం దక్కినా అనన్యకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.
ప్రస్తుతం అనన్య బూట్ కట్ బాలరాజు పేరుతో ఓ చిత్రం చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటిస్తున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. టాప్, టైట్ జీన్స్ ధరించి హిప్ షేపులతో మైండ్ బ్లాక్ చేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.