MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహమ్మద్ గజినీలాగా అతి చేస్తున్నావ్, నువ్వు వేస్ట్ అంటూ నితిన్ కి అవమానం..అతడికి బిగ్ మైనస్ హీరో శివాజినేనా ?

మహమ్మద్ గజినీలాగా అతి చేస్తున్నావ్, నువ్వు వేస్ట్ అంటూ నితిన్ కి అవమానం..అతడికి బిగ్ మైనస్ హీరో శివాజినేనా ?

టాలీవుడ్ లో పడిలేచిన కెరటం లాగా ఎదిగిన హీరోల్లో నితిన్ కూడా ఒకరు. నితిన్ కి కెరీర్ బిగినింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి. దిల్, జయం, సై లాంటి సూపర్ హిట్స్ దక్కడంతో నితిన్ క్రేజీ హీరోగా మారాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2024, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో పడిలేచిన కెరటం లాగా ఎదిగిన హీరోల్లో నితిన్ కూడా ఒకరు. నితిన్ కి కెరీర్ బిగినింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి. దిల్, జయం, సై లాంటి సూపర్ హిట్స్ దక్కడంతో నితిన్ క్రేజీ హీరోగా మారాడు. నితిన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇదంతా అతడు పదేళ్ల పరాజయాల నుంచి తిరిగి పుంజుకోవడం వల్లే జరిగింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సై తర్వాత నితిన్ కి పదేళ్లు హిట్స్ లేవు. ఆ టైంలో నితిన్ చేయని ప్రయోగం అంటూ లేదు. చివరకి 8 ప్యాక్ బాడీ కూడా ట్రై చేసి సినిమా చేశాడు. అవి కూడా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయినప్పుడు వీరుడు సూరుడు అంటూ ప్రశంసలు దక్కుతాయి. కానీ అదే తేడా కొడితే చులకనగా చూసి అవమానిస్తాడు. 

 

36

నితిన్ కూడా అలాంటి అవమానాలే ఎదుర్కొన్నాడట. ఓ ఇంటర్వ్యూలో నితిన్ ఆ అవమానాలని గుర్తు చేసుకున్నాడు. ఓ వ్యక్తి నితిన్ గురించి మాట్లాడుతూ దారుణంగా అవమానించాడట. నితిన్ మహమ్మద్ గజినీ లాగా చాలా అతి చేస్తున్నాడు. కానీ వర్కౌట్ కావడం లేదు. అతడి బాడీ లాంగ్వేజ్ సినిమాలకు కరెక్ట్ కాదు. 

 

46
Sivaji

Sivaji

ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుంటే బెటర్ అని అన్నాడట. కాయాన్ని ఆ అవమానాన్ని తాను చాలా ఓపిగ్గా భరించానని నితిన్ తెలిపాడు. మరొకొందరు నితిన్ వాయిస్ దారుణంగా ఉందని అన్నారట. అందుకు పరోక్షంగా కారణం హీరో శివాజీ అని చెప్పొచ్చు. 

 

56

నితిన్ కెరీర్ బిగినింగ్ లో అతడికి హీరో శివాజీ డబ్బింగ్ చెప్పాడు. శివాజీ వైస్ నితిన్ కి బాగా సెట్ అయింది. నితిన్ తొలి చిత్రం నుంచి శివాజీ వాయిస్ పై డిపెండ్ కావడం కూడా మైనస్ గా మారింది. ఆ తర్వాత సొంత వాయిస్ తో నితిన్ డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. నితిన్ వాయిస్ ఆడియన్స్ కి అలవాటయ్యే వరకు విమర్శలు ఎదురయ్యాయి. 

66

ఇష్క్ రిలీజ్ తర్వాత తనపై వచ్చిన విమర్శలు అన్నీ పటాపంచలు అయినట్లు నితిన్ తెలిపాడు. తనని అవమానించిన వ్యక్తే క్షమాపణ కోరాడు  అని నితిన్ తెలిపాడు. పదేళ్ల పాటు హిట్స్ లేకపోవడానికి కారణం తాను ఎంచుకున్న రాంగ్ స్టోరీస్ అని నితిన్ తెలిపాడు. మరికొన్ని మంచి కథలు ఉన్నప్పటికీ స్క్రీన్ పై అవి కరెక్ట్ గా ప్రెజెంట్ కాలేదు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved