MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరో చేసిన తప్పుకి దశాబ్దాలు బాధపడ్డ జమున.. మెడ సమస్యకి కారణం అదే, ఆపరేషన్ చేయాలని చెబితే..

హీరో చేసిన తప్పుకి దశాబ్దాలు బాధపడ్డ జమున.. మెడ సమస్యకి కారణం అదే, ఆపరేషన్ చేయాలని చెబితే..

అలనాటి నటి జమున మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యం కారణంగా జమున హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం మరణించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 27 2023, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అలనాటి నటి జమున మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యం కారణంగా జమున హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం మరణించారు. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Jamuna

Jamuna

అప్పట్లో జమున ఎంతో ఎనెర్జిటిక్ గా ఉంటూ వరుసగా సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపేవారు. తనకు వచ్చిన ప్రతి అవకాశం వినియోగించుకుని ఉంటే తన చిత్రాల జాబితా 500 దాటి ఉండేది అని జమున ఓ సందర్భంలో అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె 80వ దశకం నుంచి సినిమాలకు దూరం అవుతూ వచ్చారు. 

37

జమున సినిమాల సంఖ్య తగ్గించడానికి ఆమె మెడ నరాల సమస్య కూడా ఒక కారణం. అయితే జమునకి మెడ నరాల సమస్య వయసు వల్ల వచ్చింది కాదు. తమిళ హీరో చేసిన పొరపాటు వల్ల జమున ఈ మెడ సమస్యతో దశాబ్దాలు బాధపడ్డారు. ఆ హీరో ఎవరో కాదు అలనాటి తమిళ నటుడు జైశంకర్. 

47

లేత మనసులు చిత్రంలో తెలుగులో జమున, హరనాథ్ నటించారు. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో హీరోయిన్ జముననే.. హీరోగా జైశంకర్ చేసారు. జై శంకర్ కి అదే తొలి చిత్రం. సాంగ్ షూటింగ్ జరుగుతున్నపుడు.. జైశంకర్ గడ్డి వామి నుంచి దొర్లుకుంటూ వచ్చి కింద ఉన్న జమున పక్కన కూర్చోవాలి. రిహార్సల్స్ లో కరెక్ట్ గా చేసాడట. కానీ షూట్ చిత్రీకరిస్తున్నప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో ఏమో.. సరాసరి జమున తలపై పడిపోయారు. 

57
jamuna

jamuna

ఆయన కంప్లీట్ వెయిట్ తలపై బలంగా తగిలింది అట. దీనితో తన మెడ విరిపోయింది ఏమో అని కొన్ని క్షణాల పాటు తీవ్ర నొప్పితో బాధపడ్డట్లు జమున తెలిపారు. ఆ తర్వాత తేరుకుని చికిత్స తీసుకుని కోలుకున్నా. అప్పటికి బాగానే ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఎక్స్ రే మాత్రమే ఉండేది. అడ్వాన్స్డ్ స్కానింగ్ లేదు.. దీనితో లోపల ఎలా ఉందో తెలియలేదు. 

67

ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించా. కానీ రాజపుత్ర రహస్యం చిత్రంతో మెడ సమస్య తిరగబెట్టింది. వణుకు మొదలయింది అని జమున అన్నారు. సినిమాలకు దూరమైన తర్వాత, స్కానింగ్ టెక్నాలజీ వచ్చాక వైద్యులకు చూపించుకున్నాను. తలలో ఒక నరం సమస్య ఉందని చెప్పారు. 

77

ఆపరేషన్ చేయాలనీ అన్నారు. ఈ వయసులో నాకు తల ఆపరేషన్ అవసరం లేదు అని.. సినిమాలు కూడా చెయ్యట్లేదు కాబట్టి వణుకు ఉన్నప్పటీ అలాగే ఉండిపోయాను అని జమున తెలిపారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
Recommended image2
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved