MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిండు జాబిలిలా జెనీలియా అందం.. మల్లెపూలతో మరింత పెరిగిన సొగసు, లేటెస్ట్ పిక్స్ వైరల్

నిండు జాబిలిలా జెనీలియా అందం.. మల్లెపూలతో మరింత పెరిగిన సొగసు, లేటెస్ట్ పిక్స్ వైరల్

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 29 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జెనీలియా తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం. 

37

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

47

జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జెనీలియా టాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెని అవకాశాలు వరించాయి. 

57

జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. వివాహం తర్వాత కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె గ్లామర్ ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా జెనీలియా అద్భుతమైన చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇస్తోంది. 

67

చీరకట్టులో నిండుదనంతో జెనీలియా సొగసు రెట్టింపు అయింది. చిరునవ్వులు చిందిస్తూ నిండు జాబిలిలా ఈ సీనియర్ బ్యూటీ వెలిగిపోతోంది. మల్లెపూలు జెనీలియా అందాన్ని మరింత పెంచుతున్నాయి. 

77

జెనీలియాకు టాలీవుడ్ లో హీరో మంచు విష్ణు, రామ్ పోతినేని లతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరితో జెనీలియా ఢీ, రెడీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Recommended image2
Student Movie Teaser: శ్రీహరి కొడుకు అదరగొట్టేశాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్ వచ్చేసింది
Recommended image3
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved