MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప – 2: షాకింగ్ ట్విస్ట్, 'కీ' టెక్నీషన్ వెళ్లిపోయారు,టెన్షన్ లో టీమ్?

పుష్ప – 2: షాకింగ్ ట్విస్ట్, 'కీ' టెక్నీషన్ వెళ్లిపోయారు,టెన్షన్ లో టీమ్?

రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో సినిమా కీ టెక్నీషియన్ ప్రాజెక్టు నుంచి బయిటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

3 Min read
Author : Surya Prakash
Published : May 16 2024, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ  ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో సినిమా కీ టెక్నీషియన్ ప్రాజెక్టు నుంచి బయిటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
 

28


డేట్స్ క్లాష్  సమస్యల కారణంగా పుష్ప 2 ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ చిత్రం నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు కీ టీమ్ సహకారం అత్యవసరం. అప్పుడే అద్బుతమైన అవుట్ ఫుట్ వస్తుంది. అయితే అనుకున్న టైమ్ కన్నా పుష్ప 2 లేటు అవుతూ రావటంతో తప్పనిసరిపరిస్దితుల్లో వేరే కమిట్మెంట్స్ తో ఎడిటర్ ..ప్రాజెక్టుకు బై చెప్పినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది. 

38


పుష్ప: ది రైజ్, జవాన్, బిగిల్, మెర్సల్, వివేగం వంటి బ్లాక్‌బస్టర్‌లను ఎడిటింగ్ చేయడంలో పేరుగాంచిన ఆంటోనీ రూబెన్, తన హెక్టిక్ షెడ్యూల్‌లో సమయం కేటాయించలేక సినిమా నుండి  ప్రెండ్లీగానే తప్పనిసరి పరిస్దితుల్లో బయిటకు వెళ్లాడని చెప్తున్నారు.  రూబెన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న  వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్‌తో భారీగా పాల్గొంటున్నాడు. ఆ సినిమాకు అతను ఎడిటింగ్ మాత్రమే కాకుండా అసోసియేట్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. అతను మరో చిత్రం కూడా కమిట్ అయ్యాడు.

48


ఇక ఆంటోని రూబెన్ నిష్క్రమణ తరువాత, సుకుమార్,  అల్లు అర్జున్ టీమ్ రకరకాల ఆలోచనలు చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో  ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించడానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలితో చర్చలు ప్రారంభించారు. నవీన్ నూలి  గతంలో సుకుమార్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క నాన్నకు ప్రేమతో (2016) మరియు రామ్ చరణ్ నటించిన రంగస్థలం (2018) చిత్రాలకు పనిచేశాడు.
 

58


అలాగే  అల్లు అర్జున్ 2020 తెలుగు బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములోను కూడా ఎడిట్ చేశాడు. అలాగే నవీన్ ఎడిటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ యొక్క తెలుగు గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్, OG, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో నవీన్ తమ టీమ్ లోకి పుష్ప 2 ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

68


ఇక చాలా భాగం ఎడిటింగ్ అయ్యిపోయిందని, ఫినిషింగ్ టచెస్ కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయని, కాబట్టి రిలీజ్ డేట్ పై ఈ మార్పు ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టదని అంటున్నారు. నవీన్ నూలితో సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ పనిచేసి ఉండటంతో ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ కూల్ గా ఉండచ్చు. 
 

78
allu arjun movie pushpa 2 The Rule Lyrical video, fahadh faasil

allu arjun movie pushpa 2 The Rule Lyrical video, fahadh faasil

ఇక పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. 
  

88

 పుష్పలో  ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.   అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ .  ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity Divorces: ఏఆర్ రెహమాన్, ధనుష్ బాటలో విజయ్.. కుదిపేసిన సెలెబ్రిటీ జంటల విడాకులు ఇవే!
Recommended image2
Ram Charan: బిగ్ ట్విస్ట్.. పెద్దిలో రాంచరణ్ క్రికెటర్ కాదు, అసలైన రచ్చ దాచిపెట్టేసిన బుచ్చిబాబు ?
Recommended image3
Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved