MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కామిక్-కాన్‌ కు వెళ్లని దీపికా పదుకునే.. కారణం ఏంటంటే..?

కామిక్-కాన్‌ కు వెళ్లని దీపికా పదుకునే.. కారణం ఏంటంటే..?

కామిక్ ‌-కాన్ లో మొదటిసారి సందడి చేస్తోంది మన ఇండియన్ సినిమా.. అది కూడా మన తెలుగు సినిమాకు ఈ గౌరవం దక్కడ.. టాలీవుడ్ ను మరోమెట్టు ఎక్కించనట్టే. ఇప్పటికే ప్రాజెక్ట్ K టీమ్ అమెరికాలో సందడి చేయగా.. దీపికా పదుకునే మాత్రం ఈవెంట్ కు వెళ్ళలేదు. కారణం ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 20 2023, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Project K

Project K

యంగ్ రెబల్ స్టార్ .. ప్రభాస్  హీరోగా  పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్  కె. నాగ్ అశ్విన్  ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రభాస్ జోడీగా.. న‌టిస్తోంది. ఇండియన్ సినిమా ఉద్దండులు ఈసినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి  బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ నటిస్తుండగా.. ప్రభాస్ కు విలన్ గా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ  దిశా ప‌టాని కూడా కీల‌క పాత్ర‌లో  న‌టిస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram

ఎంతో ప్రతిష్టాత్మకంగా..  వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ప్రాజెక్ట్ కే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రభాస్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్తుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్ . కాని రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. దాంతో ఈసినిమాపై ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. 
 

36

రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈమూవీ ఫస్ట్ పార్ట్ మూవీని 12 జ‌న‌వ‌రి 2024న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ అవ్వకముందు రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్-కాన్‌లో పాల్గోనే అవకాశం ఇండియా నుంచి మొదటి సారి ఈసినిమాను వరించింది. 
 

46
Project K

Project K

దాంతో ఈ అవకాశాన్ని గట్టిగా యూస్ చేసుకోవాలి అని అనకుంటున్నారు టీమ్. అందులో భాగంగా.. ఈసినిమా  టైటిల్ గ్లింప్స్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో ఈ ఈవెంట్ కోసం ప్ర‌భాస్‌, రానా, క‌మ‌ల్ హాస‌న్‌లు ఇప్ప‌టికే అక్క‌డికి చేరుకున్నారు. అయితే.. హీరోయిన్ దీపికా ప‌దుకొనే మాత్రం వెళ్ల‌లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే హాలీవుడ్‌లో న‌డుస్తున్న స‌మ్మె.
 

56

అదేంటీ హాలీవుడ్ స‌మ్మెకు దీపిక‌కు సంబంధం ఏమిట‌ని అంటారా..? సమ్మె చేస్తున్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ లో దీపిక ప‌దుకునే సభ్యురాలు కావ‌డ‌మే. స‌మ్మె జ‌రుగుతుండ‌డంతో న‌టీన‌టులు ఏదైనా ఈ వెంట్‌కు ప్ర‌చార లేదా ప్ర‌చార సేవ‌ల‌ను అందించ‌రాద‌ని యూనియ‌న్ పేర్కొంది. దీంతో ప్రాజెక్ట్ K గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు దీపిక హాజ‌రు కావ‌డం లేదు.

66
Project K

Project K

2017లో దీపిక హాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. విన్ డీజిల్‌తో క‌లిసి ‘ట్రిపుల్ ఎక్స్’ మూవీలో న‌టించింది. ఈ స‌మ‌యంలోనే SAG-AFTRAలో దీపిక స‌భ్య‌త్వం తీసుకుంది. మరో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సైతం సమ్మెకు తన మద్దతు తెలిసిన సంగ‌తి తెలిసిందే.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved