MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని తెలుసుకున్న దీప.. సౌందర్య ఇంటి నుంచి పారిపోయిన మోనిత?

Karthika Deepam: కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని తెలుసుకున్న దీప.. సౌందర్య ఇంటి నుంచి పారిపోయిన మోనిత?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 03 2022, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో దీప,సౌర్యని వెతకడానికి వెళ్తాను అని మొండి పట్టు పడుతుండగా కార్తీక్ ఆ డాక్టర్ ఇద్దరు వెళ్లొద్దు దీప అని అంటుంటారు. దీప వెళ్తాను అని బలవంతం చేస్తుండడంతో వెంటనే ఆ డాక్టర్ దీప షటాప్ అని గట్టిగా అరుస్తుంది. ఇందాక నుంచి వెళ్తాను అంటున్నావు ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నారో నీకు తెలుసా అని అనగా వెంటనే కార్తీక్ చెప్పొద్దు అంటూ సైగ చేస్తాడు. అప్పుడు దీప ఎందుకు ఉన్నారు ఆయన ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయన నాకేమైనా ఆపరేషన్ చేశారా అని అనగా వెంటనే డాక్టర్ ఆపు అని అంటుంది. కూతురు కోసం వెళ్లమని చెబుతున్నావు నిన్ను ఎలా వదిలేసి ఎలా వెళ్తాడు అయినా ఆయన నీకోసం ఎంత తాపత్రయపడుతున్నాడో నీకు ఏమవుతుందని ఎంత బాధ పడుతున్నాడో తెలుసా అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏమన్నావ్ ఆయన నీకేమైనా ఆపరేషన్ చేశారా అన్నావు కదా అవును ఆయనే నీకు ఆపరేషన్ చేశారు అని అంటుంది ఆ డాక్టర్. డాక్టర్ కార్తీక్ ఫేమస్ కార్డియాలజిస్ట్ అని అనడంతో దీప ఆశ్చర్య పోతుంది. అవును మీ డాక్టర్ బాబు నీకు ఆపరేషన్ చేశారు అని అంటుంది ఆ డాక్టర్. అంటే మీకు గతం గుర్తుకొచ్చిందా అనడంతో అవును అని అనగా దీప సంతోష పడుతూ ఉంటుంది. మరి ఎదురుగా ఉండి నేను ఇంత బాధ పడుతున్న ఎందుకు చెప్పలేదు. సౌర్య ని వెతుకొచ్చు కదా అందరం కలిసి పోయే వాళ్ళము అని అంటుంది దీప. ఆ తర్వాత కార్తీక్, దీపకి ఇంజక్షన్ చేసి పడుకోమని చెబుతాడు.
 

36

 మరొకవైపు మోనిత తన బాబుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉంటుంది. అప్పుడు హిమ ఎక్కడికి అని అనగా ఇప్పుడే వస్తాను అమ్మ చిన్న పని ఉంది వెళ్ళొస్తాను అని అంటుంది. అప్పుడు హిమ మాత్రము వద్దు నానమ్మ వచ్చిన తర్వాతే బయటికి వెళ్ళు అని అంటుంది. అప్పుడు హిమ ఎంత చెప్పినా వినిపించుకోకుండా మోనిత అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. మరొకవైపు గతంలో మోనితని పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు మళ్ళీ మోనితని అరెస్టు చేయమంటూ అరెస్టు వారెంట్ రావడంతో ఈ మోనిత ఎక్కడ ఉందో అనుకుంటూ పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు.
 

46

అప్పుడు ఆ పోలీస్ సౌందర్య దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుందేమో అని అంటుంది. వెంటనే మోనిత ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కనుక్కోండి అని అంటుంది.   మరొకవైపు మోనిత క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి బాబుని తీసుకుని వెళుతూ ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ తొందరగా స్పీడ్ గా పోనివ్వు అని చెబుతుంది. మరొకవైపు మోనిత కనిపించకపోయేసరికి సౌందర్య టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో హిమ అక్కడికి వచ్చి జరిగింది మొత్తం వివరిస్తుంది. బయటికి పని ఉందని వెళ్ళింది నానమ్మ వస్తుందని ఇంకా బయటే ఎదురుచూస్తున్నాను ఇంకా రాలేదు అని అంటుంది.

56

దాంతో సౌందర్య వాళ్ళు టెన్షన్ పడుతూ సౌర్య చెప్పింది నిజమేమో నిజంగా కార్తీక్ వాళ్ళు బతికున్నారేమో అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు.  మరొకవైపు కార్తీక్ జ్యూస్ కలుపుతూ ఉండగా అప్పుడు దీప పదేపదే కార్తీక్ ని డాక్టర్ బాబు అని పిలుస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును అక్కడ బాబు మీకు ఎప్పుడు గతం గుర్తుకు వచ్చింది అని అనగా ఆరోజు సంగారెడ్డికి వెళ్ళాం కదా దసరా ఉత్సవాలలో అప్పుడు గుర్తుకు వచ్చింది అని చెబుతాడు కార్తీక్. మరి ఎందుకు చెప్పలేదు డాక్టర్ బాబు అనడంతో చెప్పకపోవడానికి కారణం ఆ మోనిత అంటాడు కార్తీక్. అప్పుడు నాకు చెప్పి ఎవరికీ చెప్పొద్దు ఉంటే నేను చెప్పకుండా ఉండేదాన్ని కదా నాకు ఇన్ని రోజులు ఈ బాధ ఉండేది కాదు కదా డాక్టర్ బాబు అని అంటుంది.
 

66

అప్పుడు దీప ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇక చాలు మీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి అవన్నీ మళ్లీ చెబుతాను అని అంటాడు కార్తీక్. అప్పుడు దీపకి జ్యూస్ తాపిస్తాడు కార్తీక్. మరొకవైపు మోనిత డ్రైవర్ ని ఇంకా స్పీడ్ గా వెళ్ళు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు ఇంద్రుడు ఇంటికి వెళ్ళగా చంద్రమ్మ కనిపించారా అనడంతో లేదు చంద్రమ్మ అని అనగా అప్పుడు చంద్రమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఆరోజు వాళ్లకి ఇవ్వకుండా మనం చాలా పెద్ద తప్పు చేసాము మనం కావాలంటే జ్వాలమ్మతో పాటు వెళ్లిపోయిన సరిపోయిండేది అని అంటాడు ఇంద్రుడు.ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి ఏం జరిగింది బాబాయ్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగా అప్పుడు ఇంద్రుడు వాళ్ళు అబద్ధాలు చెబుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved