MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది

Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది

చిరంజీవి సినిమాల్లోకి రావడం, హీరో కావడానికి కారణం ఒక సూపర్‌ స్టార్‌. ఆయన చెప్పిన మాట వల్లే మెగాస్టార్ మద్రాస్‌ వెళ్లడం, ఆ తర్వాత శిక్షణ తీసుకోవడం, అట్నుంచి హీరోగా మారిపోవడం జరిగింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 27 2026, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్వయంకృషితో హీరోగా ఎదిగిన చిరంజీవి
Image Credit : Asianet News

స్వయంకృషితో హీరోగా ఎదిగిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో స్ట్రగుల్‌ అయి, స్వయంకృషితో ఎదిగిన హీరో. ఎంతో హార్డ్ వర్క్ తో తనని తాను మలుచుకొని తిరుగులేని సూపర్‌ స్టార్‌గా, ఆ తర్వాత మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. ఎంత మంది తర్వాత తరం హీరోలు వచ్చినా తన స్థానం చెక్కు చెదరలేదంటే అది ఆయన గ్రేట్‌నెస్‌కి నిదర్శనం. అయితే చిరంజీవి హీరో కావడం వెనుక.. సినిమాల్లోకి రావడం వెనుక ఒక సూపర్‌ స్టార్‌ ఉన్నారు. ఆయన చెప్పిన ఒక్క మాటతోనే చిరంజీవి లైఫ్‌ మారిపోయింది. మరి ఆ సూపర్‌ స్టార్‌ ఎవరనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రజనీకాంత్‌, జీవీ నారాయణరావుని కలిసిన చిరంజీవి
Image Credit : Asianet News

రజనీకాంత్‌, జీవీ నారాయణరావుని కలిసిన చిరంజీవి

చిరంజీవి `పునాదిరాళ్లు` మూవీతో హీరోగా మారిన విషయం తెలిసిందే. `ప్రాణంఖరీదు` చిత్రంతో మొదట హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇది 1978లో విడుదలైంది. అయితే ఈ మూవీకంటే ముందు ఆయన సినిమాల్లోకి రావడానికి ఒక హీరో కారణమయ్యారు. ఆ వివరాలు చూస్తే, 1977లో `చిలకమ్మ చెప్పింది` సినిమా వచ్చింది. ఇందులో జీవీ నారాయణరావు హీరోగా నటించారు. రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో షూటింగ్‌ చూడ్డానికి వెళ్లారు చిరంజీవి. సెట్‌లో రజనీకాంత్‌, జీవీ నారాయణరావు ఉన్నారు. వారిని కలిశారు చిరంజీవి.

34
రజనీకాంత్‌ చెప్పిన మాటతో చిరంజీవి లైఫ్‌ ఛేంజ్‌
Image Credit : Asianet News

రజనీకాంత్‌ చెప్పిన మాటతో చిరంజీవి లైఫ్‌ ఛేంజ్‌

ఆ సమయంలో వీరి వద్ద చిరంజీవి సినిమాల్లోకి రావాలనే తన ఇంట్రెస్ట్ ని చూపించారు. చిరు ఇంట్రెస్ట్ ని గమనించిన రజనీకాంత్‌ కలగజేసుకొని ఒక మాట చెప్పారట. సినిమాల్లోకి రావాలంటే ఫస్ట్ యాక్టింగ్‌ నేర్చుకోవాలని, మేం అలానే వచ్చామని, మద్రాస్‌లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఉందని, అందులో చేరాలని రజనీకాంత్‌ చెప్పారట. ఆ మాట విని చిరంజీవి నేరుగా మద్రాస్‌ వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్‌ అక్కడే ట్రైన్‌ అవుతున్నారు. ఆయన చిరంజీవికి సీనియర్‌. నటనలో శిక్షణ కూడా ఇచ్చాడట. కానీ ట్రైనింగ్‌ అయిన ఏడాదికే చిరంజీవికి సినిమా ఛాన్స్ వచ్చింది. అదే `పునాది రాళ్లు` చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ తర్వాత `ప్రాణం ఖరీదు` సినిమా వచ్చింది. ఇది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. `ఖైదీ` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది తొలి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

44
కాకాతో రాబోతున్న చిరంజీవి
Image Credit : Asianet News

కాకాతో రాబోతున్న చిరంజీవి

ఇప్పుడు 156సినిమాలు చేశారు చిరంజీవి. 157వ మూవీ విశ్వంభర రిలీజ్‌ కావాల్సింది. ప్రస్తుతం 158వ మూవీ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. దీనికి `కాకా` అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా దీని గ్లింప్స్ విడుదల చేయగా, ఆకట్టుకుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved