MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..

GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..

GV Narayana Rao Passes Away: ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, జీవీ నారాయణ రావు కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 27 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత
Image Credit : Asianet News

సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) బుధవారం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరాటే కళ్యాణి పోస్ట్ లో ఏముందంటే? "మరొక హీరో మన భువి తారాలోకం వీడి గగన మార్గం గుండా ఆ శివుని చేరుకున్నారు కొద్ది సేపటి క్రితం.. మన అందరి అభిమాన కథానాయకుడు చిరంజీవి గారు బాల్య మిత్రుడు అజాత శత్రువు. అందరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి మనల్ని వీడి శివైక్యం కావడం చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పోయినోళ్లందరూ మంచోళ్ళు ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఓం శాంతి" అని కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జీవీ నారాయణ రావుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈపోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జీవీ సినిమా ప్రస్థానం..
Image Credit : Asianet News

జీవీ సినిమా ప్రస్థానం..

జీవీ నారాయణ రావు 1953లో జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లు, హైదరాబాద్ లలో సాగింది. ఆయన తండ్రి జి. ప్రసాదరావు కొంతకాలం డిస్ట్రిబ్యూటర్‌గా, సారథీ స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న నారాయణ రావు, చదువుకునే రోజుల్లోనే కొన్ని నాటకాలు వేశారు. 1973లో మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో ఆయన శిక్షణ పొందారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆయనకు బ్యాచ్‌మేట్ కాగా, అక్కడే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరు మంచి స్నేహితులుగా మెలిగారు.

Related Articles

Related image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Related image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
34
నటుడిగా ‌- నిర్మాతగా ప్రయాణం
Image Credit : Asianet News

నటుడిగా ‌- నిర్మాతగా ప్రయాణం

1976లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అంతులేని కథ' చిత్రంతో జీవీ నారాయణ రావు వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలోని 'తాళికట్టు శుభవేళ' పాటలో ఆయన చూపించిన నటనకు విమ్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాకే ఆయన ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. 'ఒక ఊరి కథ', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ' వంటి సినిమాల్లో హీరోగా నటించారు. హీరోగా ఆయన సినిమాలకు ఆశించిన స్థాయిలో స్పందన దక్కకపోవడంతో క్యారెక్టర్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశాడు జీవి. సుధీర్ఘ సినిమా కెరీర్‌లో 100 పైగా సినిమాల్లో జీవి నారాయణ రావు నటించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నారాయణ రావు నటించి అలరించారు.

44
చిరంజీవి, రజనీకాంత్‌లతో సాన్నిహిత్యం
Image Credit : Asianet News

చిరంజీవి, రజనీకాంత్‌లతో సాన్నిహిత్యం

మెగాస్టార్ చిరంజీవితో నారాయణ రావుకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ కలిసి 'చట్టానికి కళ్లులేవు', 'మంచు పల్లకి', 'రాజా విక్రమార్క', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి చిరంజీవి హీరోగాగా 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత 'యముడికి మొగుడు' సినిమాను తమిళంలో తన ప్రాణస్నేహితుడు రజనీకాంత్‌తో రీమేక్ చేశారు. పలు ఇంటర్వ్యూలలో చిరంజీవి, రజనీకాంత్‌లతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి నారాయణ రావు వెల్లడించారు. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved