MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీహాన్‌ ఎఫైర్స్ బయటపెట్టిన `బిగ్‌ బాస్` కంటెస్టెంట్.. బయట సిరితోపాటు ఇంకెవరో ఉన్నారంటూ షాక్‌.. దుమారం..

శ్రీహాన్‌ ఎఫైర్స్ బయటపెట్టిన `బిగ్‌ బాస్` కంటెస్టెంట్.. బయట సిరితోపాటు ఇంకెవరో ఉన్నారంటూ షాక్‌.. దుమారం..

బిగ్‌ బాస్‌ తెలుగు 6 ఐదో రోజుకి చేరుకుంది. ఐదో రోజు ఆట మరింత రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యులు శ్రీహాన్‌కి, ఇనయ సుల్తానాకి మధ్య జరిగిన పంచాయితీ వ్యక్తిగతం వరకు వెళ్లడం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 09 2022, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌ బాస్‌(Bigg boss 6) తెలుగు ఆరో సీజన్‌ పై ఆడియెన్స్ నుంచి ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంటెస్టెంట్ల విషయంలోనూ, వారి వ్యవహారం శైలి, బిగ్‌ బాస్‌లో పస లేదంటూ విమర్శలొస్తున్నాయి. దీనికి తోడు బిగ్‌ బాస్‌ 6(Bigg boss Telugu 6) కంటెస్టెంట్ల మధ్య కూడా అదే స్థాయిలో వివాదం రాజుకుంటుండటం విశేషం. 
 

27

తాజాగా ఐదో రోజు బిగ్‌ బాస్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో రెండు విషయాలు హాట్‌ టాపిక్‌ అవుతుండటం విశేషం. వరస్ట్ పర్‌ఫెర్మర్‌ని ఎంపిక చేసుకునే విసయంలో అంతా గీతూ రాయల్‌(Geetu Royal) పేరు చెప్పగా, ఆమె సైతం తనదైన స్టయిల్‌లో రియాక్ట్ కావడం హౌజ్‌లో హీటుని పెంచుతుంది. 
 

37

ఈ క్రమంలో వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా కొంత మంది ఇనయ సుల్తానా(Inaya Sulthana) పేరుని ప్రస్తావించారు. ఆమెకి ఓటు వేశారు. బాలాదిత్య తనకు అర్థం కాలేదనే పర్సన్‌కి వరస్ట్ గా పర్‌ఫెర్మర్‌గా ఓటు వేస్తానని తెలిపారు. దీనికి ఇనయ సైతం గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. మీరు చెప్పినదాంట్లో కరెక్ట్ పాయింట్‌ లేదని, మీరు నన్ను తప్పు అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటూ నిలదీసింది. దీనికి బాలాదిత్య ముఖం మాదిపోయినంత పనైంది. 

47

అనంతరం ఇనయాకి, శ్రీహాన్‌(Srihan)కి ఇదే వరస్ట్ పర్‌ఫెర్మర్‌ ఓటింగ్‌ విషయంలో గొడవ వచ్చింది. ఇందులో శ్రీహాన్‌ ఎఫైర్స్ బయటపెట్టడం షాకిస్తుంది. సిరి(Siri) మాత్రమే కాదు ఇంకెవరెవరో ఉన్నారంటూ అందరి ముందు వ్యాఖ్యానించింది. దీంతో ఇప్పుడు దుమారం రేపుతుంది. 

57

శ్రీహాన్‌కి మధ్య కన్వర్జేషన్‌లో నోరు జారింది ఇనయ. ఆమె ఆవేశంలో మాట్లాడుతూ, `నేను సింగిల్‌గా వచ్చాను, నాకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి నేనుచేస్తున్నానిక్కడ. నేను ఎగ్జైట్‌ అవుతాను, సెల్ఫ్‌గా అప్పీల్‌ కూడా చేసుకుంటాన`ని చెప్పింది. అంతేకాదు శ్రీహాన్‌కి సంబంధించిన పర్సనల్‌ విషయాల్లోకి వెళ్లింది ఇనయ. `నీకు సిరి ఉంది, ఇంకా ఎవరెవరో ఉన్నారు బయట` అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి శ్రీహాన్‌ వార్నింగ్‌ ఇవ్వడం విశేషం. 
 

67

కానీ ఇనయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయట దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇనయా వ్యాఖ్యలను బేస్‌ చేసుకుని రకరకాల మీమ్స్ రెడీ చేస్తున్నారు ట్రోలర్స్. మధ్యలోకి సిరిని లాగుతూ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా ఇనయ ఆవేశంలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.  దీనిపై సిరి రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 
 

77

ఇదిలా ఉంటే గత సీజన్‌(బిగ్‌ బాస్‌ 5)లో సిరి కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. వీరిద్దరి మధ్య జరిగిన వ్యవహారం కారణంగా సో పూర్తయ్యాక షణ్ముఖ్‌, తన గర్ల్ ఫ్రెండ్‌ దీప్తి సునైనా బ్రేకప్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇనయ కామెంట్లు ఎలాంటి ముప్పుకి దారితీస్తుందో అనేది ఆందోళన కలిగిస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved