MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ

Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠని రేకెత్తించింది. సాధారణంగా గేమ్ లో పోటీ దారుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ ఈ ఎపిసోడ్ లో పోటీదారుడికి, సంచాలకుడి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 16 2026, 11:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో డే 10 ఆసక్తికరంగా సాగింది. పదవరోజు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కి వంశీ, సృష్టి సంచాలకులుగా వ్యవహారించారు. అమన్, షాలిని ఒక టీంగా.. ముఖేష్, ఝాన్సీ మరో టీంగా ఈ టాస్క్ లో పోటీ పడ్డారు. తమ టీం సభ్యుల్లో ఒకరు యానిమల్స్ లా నటిస్తూ చూపించాలి. తమ పార్ట్నర్ ఏ యానిమల్ గా నటిస్తున్నాడో గ్రహించి దానికి సంబంధించిన బాక్స్ ని రెండో సభ్యులు అమర్చాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముఖేష్, ఝాన్సీ విజయం
Image Credit : Jiohotstar

ముఖేష్, ఝాన్సీ విజయం

ఈ టాస్క్ లో ముఖేష్, ఝాన్సీ విజయం సాధించారు. అమన్ సరిగ్గా నటించి చూపించలేకపోవడం, షాలిని వేగంగా అమర్చలేకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోయారు. గెలిచిన ముఖేష్, ఝాన్సీ.. ఓడిపోయిన వారిలో ఒకరిని పూర్తిగా కెప్టెన్సీ కంటెండర్స్ రేసు నుంచి తప్పించాలి అని బిగ్ బాస్ అడిగారు. దీనితో వాళ్లిద్దరూ అమన్ పేరు చెప్పారు. దీనితో అమన్ పూర్తిగా కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి వైదొలిగాడు.

35
కిచెన్ లో వివాదం
Image Credit : Jiohotstar

కిచెన్ లో వివాదం

ఆ తర్వాత హౌస్ కిచెన్ వద్ద పెద్ద హంగామా జరిగింది. ఫుడ్ విషయంలో టెంపర్ వంశీ, వర్షిణి మధ్య పెద్ద గొడవ జరిగింది. కానీ రామ్ ప్రసాద్, దేబ్జానీ కలగజేసుకుని పరిస్థితి కూల్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత రణరంగాన్ని తలపించే ఫిజికల్ టాస్క్ జరిగింది. ఈ ఫిజికల్ టాస్క్ లో త్రిగుణ్, రామ్ ప్రసాద్ ఒక టీం గా.. రోహిత్, దేబ్జానీ మరో టీంగా పోటీ పడ్డారు.

45
టెంపర్ వంశీకి టెంపర్ లేచింది
Image Credit : Jiohotstar

టెంపర్ వంశీకి టెంపర్ లేచింది

పైనుంచి పడుతున్న బంతుల బ్యాగ్ లని చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఫిజికల్ గా పోటీ పడుతూ ఒకరి చేతి నుంచి మరొకరు ఆ బ్యాగ్స్ ని లాక్కోవచ్చు. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్, త్రిగుణ్ విజయం సాధించారు. కానీ దేబ్జానీ అంత ఈజీగా గేమ్ ని విడిచిపెట్టలేదు. ఫిజికల్ గా చాలా ట్రై చేసింది. సంచలకుడిగా ఉన్న వంశీతో రోహిత్ కి తీవ్రమైన గొడవ జరిగింది. ఒకరినొకరు దాడి చేసుకోవడానికి మీదికి దూకారు. వంశీ సంచలకుడిగా సరిగ్గా చేయలేదు అనేది రోహిత్ అభియోగం. ఒకరి నొకరు ఏంట్రా అని తిట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళింది.

55
చుక్కలు చూపించిన దేబ్జానీ
Image Credit : Jiohotstar

చుక్కలు చూపించిన దేబ్జానీ

రోహిత్, దేబ్జానీ ఓడిపోవడంతో కెప్టెన్సీ కెప్టెన్సీ కంటెండర్స్ రేసు నుంచి ఒకరు తప్పుకోవాల్సి వచ్చింది. ఇద్దరూ త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. నువ్వు నెక్స్ట్ లెవల్ కి వెళితే వాళ్లతో ఫిజికల్ గా పోటీ పడలేవు. కాబట్టి నాకోసం త్యాగం చేసి తప్పుకో అని రోహిత్ దేబ్జానీని రిక్వస్ట్ చేశాడు. పోటీ పడగలనో లేదో ఆడితే కదా తెలిసేది. నువ్వే నా కోసం త్యాగం చెయ్ అంటూ దేబ్జానీ రోహిత్ కి చుక్కలు చూపించింది. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ తేలకపోవడంతో ఒకరిని తప్పించే బాధ్యతని బిగ్ బాస్ గెలిచిన రామ్ ప్రసాద్, త్రిగుణ్ లకే అప్పగించారు. దీనితో వాళ్లిద్దరూ రోహిత్ ని తప్పించారు. దీనితో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో త్రిగుణ్, రామ్ ప్రసాద్ లతో పాటు నెక్స్ట్ లెవల్ కి వెళ్లే అవకాశం దేబ్జానీకి కూడా దక్కింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image2
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image3
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Related Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved