- Home
- Entertainment
- Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే బెస్ట్ జర్నీ మూవీస్ కొన్ని ఉన్నాయి. కార్తీ, శర్వానంద్, గోపీచంద్, నిఖిల్ లాంటి హీరోలు నటించిన ఆ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Best Journey Movies
కొన్నిసార్లు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాల కంటే వైవిధ్యమైన కథతో వచ్చిన సినిమాలు గొప్ప విజయం సాధిస్తుంటాయి. జర్నీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హీరో తన గమ్యానికి చేరుకోవడం లేదా తన ఆశయ సాధన కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జర్నీ చేయడం ఇలాంటి అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇలా హీరో ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో కార్తీ ఖైదీ, గోపీచంద్ సాహసం, కార్తికేయ 2 లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలలో స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచింది.
ఖైదీ
ఇది కంప్లీట్ రోడ్ జర్నీ మూవీ. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మత్తులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పోలీసులని సురక్షిత ప్రాంతానికి తరలించడం ఆ తర్వాత తన కూతురిని చేరుకోవడం హీరో లక్ష్యం. తన ప్రయాణంలో హీరోకి పోలీసులకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అనేది ఈ చిత్ర కథ. ఇలాంటి కథకి స్క్రీన్ ప్లే కీలకం. కానీ లోకేష్ కనకరాజ్ అద్భుతంగా స్కీన్ ప్లే రూపొందించారు.
గమ్యం
శర్వానందన్ కెరీర్ లో అద్భుతమైన చిత్రాలలో గమ్యం ఒకటి. తన ప్రియురాలిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో అభిరామ్ కి గాలి శీనుతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ కలసి జర్నీ ప్రారంభిస్తారు. ఈ జర్నీలో అసలు ఎలాంటి లక్ష్యం లేకుండా ఉన్న అభిరామ్ ఎలా మారాడు అనేది కథ. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
సాహసం
గోపీచంద్, తాప్సి జంటగా నటించిన మూవీ ఇది. హీరో తన తాత దాచిపెట్టిన నిధిని వెతుక్కుంటూ పాకిస్తాన్ కి వెళతాడు. అక్కడ వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరికి నిధిని చేరుకుంటాడు.
కార్తికేయ 2
శ్రీకృష్ణుడి రహస్యాలని ఛేదిస్తూ హీరో హీరోయిన్లు చేసే సాహస ప్రయాణమే కార్తికేయ 2 చిత్రం. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. డివోషనల్ అంశాలు, ప్రాణాలకు తెగించి హీరో చేసే జర్నీ భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది.
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్
పైన పేర్కొన్నవన్నీ సీరియస్ మూవీస్. కానీ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కామెడీ ప్రధానంగా సాగే మూవీ. ఈ మూవీలో సందీప్ కిషన్, రకుల్ జంటగా నటించారు. సప్తగిరి కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా నిలిచింది.

