MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళైన 16 రోజులకే నిజస్వరూపం బయటపెట్టాడు... యాసిడ్ పోస్తాను అన్నాడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ఎస్తేరు ఫైర్!

పెళ్ళైన 16 రోజులకే నిజస్వరూపం బయటపెట్టాడు... యాసిడ్ పోస్తాను అన్నాడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ఎస్తేరు ఫైర్!

నటి ఎస్తేరు నోరాన్హ మాజీ భర్త మీద కీలక ఆరోపణలు చేసింది. పెళ్లైన కొద్దిరోజుల్లో అతని నిజ స్వరూపం తెలిసింది అంటూ ఫైర్ అయ్యింది. విడాకులకు ఆమె పరోక్షంగా కారణాలు చెప్పింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : May 14 2024, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ester Noronha

Ester Noronha

బెహ్రెయిన్ దేశంలో పుట్టిన ఎస్తేరు నోరాన్హ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆమె మొదటి చిత్రం బరోమాస్. 1000 అబద్దాలు ఆమె ఫస్ట్ తెలుగు మూవీ. అనంతరం సునీల్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది. 2014లో విడుదలైన భీమవరం బుల్లోడు సినిమాలో ఎస్తేరు నటించారు. 

26

భీమవరం బుల్లోడు ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అనంతరం గరం, జయ జానకీ నాయక, ఐరావతం  చిత్రాల్లో నటించింది. కాగా ఈమె నటుడు, సింగర్ నోయల్ సీన్ తో డేటింగ్ చేసింది. వీళ్ళ వ్యవహారం మెల్లగా బయటకు పొక్కింది. దాంతో అవును మేము రిలేషన్ లో ఉన్నామని ఓపెన్ అయ్యారు. 

 

36

2019లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరి వైవాహిక బంధం ఏడాది పాటు కూడా సాగలేదు. పెళ్ళైన రోజుల వ్యవధిలో విడిపోయారు. 2020లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అప్పట్లో నోయల్, ఎస్తేరు విడాకుల ప్రకటన చర్చకు దారి తీసింది. తాజాగా మాజీ భర్త మీద ఆమె ఆరోపణలు చేశారు. 

46


ఎస్తేరు మాట్లాడుతూ... పెళ్ళైన 16 రోజులకే అతడి నిజ స్వరూపం బయటపడింది. అందుకే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. వెంటనే విడాకులు కావాలని అనుకున్నాను. నాతో విడిపోయాక నోయల్ నాపై దుష్ప్రచారం చేశాడు. బిగ్ బాస్ హౌస్లో సింపతీ వచ్చేలా మాట్లాడాడు. సింపతీ పొందాడు కూడాను. 
 

56

ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. నేను మాత్రం మా విడాకుల విషయం ఎక్కడ మాట్లాడాలని అనుకోలేదు. నోయల్ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారు. ఒకడు అయితే యాసిడ్ పోస్తానని బెదిరించాడని... ఆమె వాపోయింది. నోయల్ మంచివాడు కాదు అందుకే విడిపోయానని ఆమె చెప్పకనే చెప్పింది. 

 

66

నోయల్ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అతడు ఎలిమినేట్ కాలేదు. అనారోగ్య కారణాలతో హౌస్ నుండి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ మీద ఆరోపణలు చేశాడు. అప్పట్లో ఇది సంచలనమైంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved