MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • పవన్‌ హిట్‌ వెనకాల బాలయ్య హస్తం.. తెరవెనుక జరిగిన అసలు విషయం బయటపెట్టిన నిర్మాత..

పవన్‌ హిట్‌ వెనకాల బాలయ్య హస్తం.. తెరవెనుక జరిగిన అసలు విషయం బయటపెట్టిన నిర్మాత..

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో బాలయ్యకి, మెగా ఫ్యామిలీకి మధ్య చిన్న గ్యాప్‌ ఎప్పుడూ కంటిన్యూ అవుతుంటుందనే టాక్‌ వినిపిస్తుంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి పవన్‌ కళ్యాణ్‌ కోసం బాలయ్య ఓ హెల్ప్ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 22 2022, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలకృష్ణ(Balakrishna) ఇటీవల రెండు రీమేక్‌లు వదులుకున్నారు. `వకీల్‌ సాబ్‌` కథ మొదట ఆయన వద్దకే వచ్చింది. కానీ రీమేక్‌ చేయడం ఇష్టం లేక, తాను సెట్‌ కాననే ఉద్దేశంతో ఆయన ఆ సినిమాని వద్దనుకున్నాడు. దాన్ని పవన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన `భీమ్లా నాయక్‌` (Bheemla Nayak) కూడా మొదటి బాలయ్యనే అనుకున్నారు. కానీ ఆయన నో చెప్పడంతో పవన్‌ చేశారు. ఈరెండు సినిమాలు పవన్‌కి మంచి కమ్‌ బ్యాక్‌గా నిలిచాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉంటే స్ట్రెయిట్‌ సినిమాలను పక్కన పెట్టి మరీ పవన్‌(Pawan Kalyan) రెండేళ్ల రాజకీయ గ్యాప్ తర్వాత రెండు రీమేక్ లతో ఆకట్టుకున్నారు. విజయాలను అందుకున్నారు. టికెట్ల రేట్ల తగ్గింపు, కరోనా వంటి ప్రతికూల పరిస్థితిల్లోనూ ఈ చిత్రాలు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యాయని ట్రేడ్‌ వర్గాల టాక్‌. పవన్‌ కూడా సక్సెస్‌ ట్రాక్‌లో పడేలా చేసింది. ఇదిలా ఉంటే `భీమ్లా నాయక్‌` హిట్‌ వెనకాల బాలయ్య హస్తం ఉందనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్‌. 

36

మలయాళ హిట్‌ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్ర రీమేక్‌ రైట్స్ దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. బాలయ్య, రానాలతో కలిసి ఈ చిత్రం రీమేక్‌ చేయాలనుకున్నారు. అందుకోసం బాలకృష్ణని, రానాలను కలిశారు. రానా చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ బాలయ్య మాత్రం నో చెప్పాడు. తనకు ఈ సినిమా సెట్‌ కాదన్నారు. అంతటితోవదిలేయలేదు, ఎవరు చేస్తే బాగుంటుందో కూడా ఆయనే సజెస్ట్ చేయడం విశేషం. 

46

నాకంటే ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాత్రని పవన్‌ చేస్తే బాగుంటుందని, సలహాలిచ్చాడట. లేటెస్ట్ గా `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 2` రెండో ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ షోకి `భీమ్లా నాయక్‌` నిర్మాత నాగవంశీ గెస్ట్ గా రాగా, ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. `భీమ్లా నాయక్‌` లో మొదట హీరో ఎవరు అని అడగ్గా, `మీరే కదా సార్‌. మీరు పవన్‌ పేరు చెబితేనే ఆయనతో చేశాం` అని తెలిపారు. 
 

56

సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ పర్యవేక్షణలో రూపొందిన `భీమ్లా నాయక్‌` డీసెంట్‌ హిట్‌ని అందుకుంది. దీంతో పవన్‌ హిట్‌ సినిమా వెనకాల బాలయ్య హస్తం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు పవన్‌ రెండు హిట్లకి కారణం పరోక్షంగా బాలకృష్ణనే కావడం విశేషం. అదే సమయంలో తమ మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదనే విషయం కూడా ఈ సంఘటనతో తేలిపోతుందంటున్నారు ఇరు హీరోల అభిమానులు. 
 

66

బాలకృష్ణ ప్రస్తుతం `వీరసింహారెడ్డి` (Veera simha reddy)చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించే ఈ చిత్ర టైటిల్‌ని శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved