- Home
- Entertainment
- అనుష్కకి ఐదు పెళ్ళిళ్లు.. ఎవరెవరితో వివరాలు కూడా చెప్పి షాకిచ్చిన స్వీటి.. బాబోయ్ ఇదే అరాచకం..
అనుష్కకి ఐదు పెళ్ళిళ్లు.. ఎవరెవరితో వివరాలు కూడా చెప్పి షాకిచ్చిన స్వీటి.. బాబోయ్ ఇదే అరాచకం..
తెలుగు ఆడియెన్స్ ముందుగా పిల్చుకునే స్వీటి.. అనుష్క ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె తన పెళ్లికి సంబంధించిన మ్యాటర్ బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అనుష్క శెట్టి.. ప్రభాస్‌కి మధ్య లవ్ ఉందని, ఈ ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పూకార్లు చాలా సార్లు వినిపించాయి. తరచూ ఈ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ `ఆదిపురుష్` సినిమా చేస్తున్నప్పట్నుంచి ఆ రూమర్స్ కృతి సనన్ వైపు తిరిగాయి. అనుష్క పక్కకెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనుష్క చెప్పిన ఓ విషయం పెద్ద రచ్చ చేస్తుంది.
Anushka shetty
అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఐదు సార్లు పెళ్లయ్యిందని చెప్పింది. ఎవరెవరితోనో వారి పేర్లు కూడా చెప్పింది. ఇది మరింత రచ్చ లేపుతుంది. మీ కెరీర్‌లో అతిపెద్ద గాసిప్ ఏంటనే ప్రశ్నకి అనుష్క రియాక్ట్ అవుతూ, నేను ఐదు సార్లు పెళ్లి చేసుకున్నా అని బదులిచ్చింది. ఎవరెవరితో అని ప్రశ్నించగా, వారి పేర్లు కూడా చెప్పింది. నేను కలిసి నటించిన కోస్టార్స్ అంటూ సుమంత్, ప్రభాస్, సెంథిల్ అని పేర్కొంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
ఇది జయప్రదతో అనుష్క చేసిన చిట్ చాట్ కి సంబంధించిన వీడియో, చాలా రోజుల క్రితం ది ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో ఆమె చెప్పిన విషయాలు సైతం హాట్ టాపిక్ గా మారాయి. అనుష్క.. సుమంత్‌తో `మహానది`, గోపీచంద్‌తో `లక్ష్యం`, `శౌర్యం` సినిమాలు చేయగా, ప్రభాస్‌తో `బిల్లా`, `మిర్చి`, `బాహుబలి1, 2` చిత్రాలు చేసింది. చాలా వరకు ఆమెకి, ప్రభాస్ కి మధ్య రిలేషన్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ అనుష్క అనూహ్యంగా మిగిలిన వారి పేర్లు చెప్పి షాకిచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది అనుష్క.. తాను నటించిన కోస్టార్లలో అత్యంత కంఫర్ట్ గా ఉండేది రవితేజతో అని పేర్కొంది. మహేష్‌బాబు, గోపీచంద్ పేర్లని పక్కన పెట్టేసింది. అలాగే యోగా అనేది తెలియకపోతే తాను కన్‌ఫ్యూజ్డ్ గా ఉండేదాన్ని అని పేర్కొంది. తన సినిమాలో బాగా నచ్చేది `అరుంధతి`, `వేదం` అని, నచ్చనిది `ఒక్కమగాడు` అని తెలిపింది అనుష్క.
అనుష్క `బాహుబలి` తర్వాత సక్సెస్ కాలేకపోతుంది. ఆమె `భాగమతి`తో ఫర్వాలేదనిపించుకుంది. కానీ పెద్ద రేంజ్ హిట్ దక్కలేదు. `జీరో సైజ్`, `సైలెంట్` చిత్రాలతో బోల్తా కొట్టింది. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ వస్తుంది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి సినిమా చేస్తుంది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె కుక్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ నవ్వులు పూయించింది. సినిమా త్వరతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.