MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: అను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం అదే.. తట్టుకోలేకపోతున్న ఆర్య?

Prema Entha Madhuram: అను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం అదే.. తట్టుకోలేకపోతున్న ఆర్య?

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఆస్తి కోసం జీవితాలతో ఆడుకుంటున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
| Updated : May 25 2023, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో నీకు కవల పిల్లల్ని పెంచలేక ఒక పిల్లాడిని వదిలేసావా తప్పు కదా అంటుంది ముసలమ్మ. వాళ్లంటే నాకు ప్రాణం వాళ్ళని వదిలి నేను ఉండలేను అంటుంది అను. నీ పేరేంటి? మీ ఆయన ఏడి అని వివరాలు అడుగుతుంది. అను ఏమి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్తావు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

నిన్ను చూస్తే బాగా బ్రతికినదానిలా కనిపిస్తున్నావు అంటుంది. దాంతో ముసలమ్మ వైపు అనుమానంగా చూస్తుంది అను. నీ బాధ నాకు అర్థమైంది నీ గురించి నువ్వు వివరాలు ఏమీ అడగను నీకోసం కాదు పిల్లల కోసం అయినా ఆలోచించు అని అనుని ఒప్పించి తనతో పాటు తీసుకువెళ్తుంది ముసలమ్మ. మరోవైపు నీరజ్ వాళ్ళు భోజనం చేయకుండా బాధలో ఉంటారు.
 

39

మాన్సీ మాత్రం ఆనందంగా కిందికి వచ్చి గోపిని వడ్డించమంటుంది. అందరూ మాన్సీవైపు అసహ్యంగా చూస్తారు. నా వైపు ఎందుకు అలా చూస్తారు భోజనం మానేసినంత మాత్రాన అను రాదు కదా మీరు కూడా వచ్చి భోం చేయండి అనే కులాసాగా వెళ్లి చికెన్ వేసుకొని భోజనం తింటూ ఉంటుంది. కూర చాలా బాగుంది గోపి అంటూ పనివాడిని మెచ్చుకుంటుంది.
 

49

కాస్తైనా అన్నం తిను అని బ్రతిమాలుతుంది. ఇంకెక్కడే ధైర్యం అమ్మ భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. ఎప్పుడు వస్తారో తెలియదు అసలు వస్తారో తెలియదు అని బాధపడతాడు ఆర్య. ఇంతలో చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తుంది. చిన్నపిల్లడిలా రోడ్డుమీదికి పరిగెడతాడు ఆర్య. ఏం జరిగిందో అనుకొని ఆర్య వెనకాతల పరిగెడతారు నీరజ్, జెండేవాళ్ళు.
 

59

అక్కడ ఒకామె పిల్లాడిని ఊరుకో పెట్టడం కోసం కూర్చుని ఉంటుంది. ఆవిడా ఆర్య వాళ్ళని చూసి భయపడుతుంది. బాబు ఏడుస్తుంటే ఇలా కూర్చున్నాను సార్ వెళ్ళిపోతాను లెండి అంటూ అక్కడే నుంచి వెళ్ళిపోబోతుంది. వద్దమ్మా కూర్చో బాబుని ఊరుకో పెట్టు అంటూ తల్లి వైపు చూసి అమ్మ ఆవిడకి ఏమైనా పెట్టమ్మా అని చెప్తాడు ఆర్య. తన దగ్గర డబ్బులు లేకపోతే నీరజ్ దగ్గర తీసుకొని ఆమెకిచ్చి బాబు కోసం ఖర్చు పెట్టు అంటాడు.
 

69

ఇంకా బాధ తీరక బాబుకి జ్వరం ఏమైనా వస్తే ఏం చేస్తావు అంటూ మెడలో ఉన్న చైన్ తీసి ఇచ్చేస్తాడు. బాగా ఎమోషనల్ అవుతున్న ఆర్య ను అలాగే చూస్తూ ఉంటాడు జెండే. కాదు జెండే ఒంటరి ఆడది బిడ్డని ఎలా పెంచుతుందో ఏమో అందుకే అంటూ కన్నీరు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అను వచ్చిందనుకున్నావు కదా అంటుంది శారదమ్మ.
 

79

అవునమ్మా ఇద్దరు పిల్లలతో తను ఎంత అవస్థ పడుతుందో అసలు తిన్నదో లేదో అంటూ ఏడుస్తాడు. ఒకవైపు కొడుకుని ఓదార్చుతూ మరోవైపు నా కొడుకుని ఇలా చూడలేకపోతున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అను ని పిల్లల్ని వెతికి తీసుకొని రండి అని జెండేకి, నీరజ్ కి చెపుతుంది శారదమ్మ. అలాగే అంటాడు జెండే. మీరు ఏడిస్తే మాకు బాధగా ఉంది దయచేసి ధైర్యంగా ఉండండి వదినమ్మ ని ఎలాగైనా తీసుకువస్తాము అంటూ నీరజ్ కూడా కన్నీరు పెట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న మాన్సీ.. పిచ్చి నీరజ్ అసలు అను ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా అంటూ గతంలోకి వెళ్తుంది. ఐ సి ఏ లో ఉండగా పిల్లల్ని చూసిన అను ఆర్య సార్ ని పిలవండి అంటుంది.

89

అప్పుడే కాంపౌండర్ వచ్చి సార్ కి దెబ్బ తగిలింది స్పృహ కోల్పోయారు అని చెప్తాడు. ఎమోషనల్ అయిన అను కంగారుగా బయటికి వస్తుంది. అప్పుడే ఒక సోదావిడ నేను అనుతో మాట్లాడాలి అంటుంది. తన పేరు వినేసరికి అలర్ట్ అవుతుంది అను. ఇది హాస్పిటల్ అయినా అను మేడం ఐ సి యు  లో ఉన్నారు నిన్ను అలవ్ చెయ్యరు అంటుంది డాక్టర్. సరే నేను చెప్పానని చెప్పండి బిడ్డలు తండ్రి గండంల్లో పుట్టారు. తండ్రి బిడ్డలు ఒకరినొకరు చూసుకుంటే వెంటనే తండ్రి చనిపోతాడు అని చెప్తుంది సోదమ్మ.

99

ఇదంతా పక్కనే ఉన్న మాన్సీ డైరెక్షన్లో జరుగుతుంది. నువ్వు చెప్పేదంతా నమ్మాలా అంటుంది డాక్టర్. బిడ్డలు పుట్టారు అని వినగానే రక్తం కళ్ళ చూశాడు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సోదమ్మ. ఒక్కసారిగా షాక్ అవుతుంది అను. అప్పుడే ఓ నిర్ణయానికి వస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved