MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?

ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?

ANR: వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన తొలి తరం హీరో అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఆ సంపాదనతో ఆయన ఏం చేశారు? ఆ తర్వాత అంత భారీ ఎత్తున ఆస్తులు ఎలా సంపాదించగలిగారు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2026, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు
Image Credit : Pinterest

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు

తెలుగు చిత్రసీమలో దిగ్గజ నటుడు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వందల సినిమాల్లో నటించిన ఏఎన్నార్, కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన జీవిత ప్రయాణం వెనుక ఎంతో కృషి, పట్టుదలతో పాటు క్రమశిక్షణ ఉన్నాయి. తన జీవితం ఎలా మొదలైంది, తాను నటుడిగా ఎలా ఎదిగారు, తొలి సంపాదన ఎంత అనే విషయాలను చాలా సందర్భాల్లో ఏఎన్నార్ పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాటకరంగంలో తొలి అడుగులు
Image Credit : IBtimes India

నాటకరంగంలో తొలి అడుగులు

అక్కినేని నాగేశ్వరరావు గారు తన కళాకారుడి ప్రస్థానాన్ని నాటక రంగం నుంచే ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయనను పక్క ఊళ్లకు తీసుకెళ్లి స్టేజ్ మీద విభిన్న పాత్రలు వేయించేవారు. 'కనకతార' వంటి ప్రముఖ నాటకాల్లో వేషాలు వేస్తూ, పద్యాలు, పాటలు పాడుతూ తన నటనా ప్రతిభను ప్రదర్శించేవారు. అక్కినేని నాగేశ్వరరావు చిన్నప్పుడు స్టేజ్ మీద ఎక్కువగా స్త్రీ పాత్రలు (లేడీ క్యారెక్టర్స్) వేసేవారట. ఆయన ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయేవారని చెప్తుంటారు.

తొలి సంపాదన ఎంత, ఏం చేశారు?

ఆ కాలంలో పల్లెటూర్లలో విద్యుత్ సౌకర్యం (కరెంట్) ఉండేది కాదు. నాటకాల ప్రదర్శన కోసం కిరోసిన్ డబ్బాలు, పెట్రోమాక్స్ లైట్లను ఉపయోగించేవారు. కిరోసిన్ డబ్బా ఖరీదుకు అయ్యే ఖర్చులో తన వంతుగా నాటక బృందానికి పావలా (25 పైసలు) చొప్పున చెల్లించేవారని ఏఎన్నార్ ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అలా నాటకాలు వేస్తూ ఆయన సంపాదించిన తొలి రోజువారీ ఆదాయం సరిగ్గా అర్ధ రూపాయి (50 పైసలు). ఆ అర్ధ రూపాయి ఆయన కళా జీవితానికి పునాదిగా మారింది. అక్కడి నుంచి ఆయన నాటకరంగంలో క్రమంగా ఎదుగుతూ వచ్చారు.

Related Articles

Related image1
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Related image2
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
34
నాటకాల నుంచి సినిమా రంగ ప్రవేశం వరకు
Image Credit : Asianet News

నాటకాల నుంచి సినిమా రంగ ప్రవేశం వరకు

నాటకాల్లో నటిస్తూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న సమయంలో ఆయన ఆదాయం నాటకానికి ఐదు రూపాయల వరకు పెరిగింది. నాటకరంగంలో ఆయన ఆఖరి సంపాదన ఒక నాటకానికి ఐదు రూపాయలు మాత్రమే. ఆ సమయంలో ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక రైల్వే ప్లాట్‌ఫామ్‌పై చూడటం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. బలరామయ్య గారు ఆయనలోని నటుడిని గుర్తించి, తెనాలిలో నాటకం ఆడుతున్న సమయంలో కలిసి సినిమా అవకాశాన్ని కల్పించారు.

అప్పటి నుంచి ఏఎన్నార్ జీవితం మారిపోయింది. "ఘంటసాల బలరామయ్య గారు నన్ను చూడకపోయి ఉంటే, ఈ పాటికి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేవాడిని" అని పలు సందర్భాల్లో ఏఎన్నార్ గుర్తుచేసుకునేవారు.

44
వేల కోట్ల సామ్రాజ్యం
Image Credit : Asianet News

వేల కోట్ల సామ్రాజ్యం

ఒకప్పుడు అర్ధ రూపాయి సంపాదనతో జీవితం ప్రారంభించిన అక్కినేని, ఆ తర్వాత హీరోగా లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. కేవలం హీరోగా మాత్రమే తన కెరీర్‌ను ఆపకుండా... నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా చెన్నైలో ఉన్నప్పుడే అక్కినేని హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఇక్కడ 'అన్నపూర్ణ స్టూడియోస్' నిర్మాణంతో ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి ప్రధాన నాంది పలికారు. ఆ తర్వాత వివిధ వ్యాపారాలు, చిత్ర నిర్మాణాల ద్వారా అక్కినేని కుటుంబం వేల కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో నాగేశ్వరరావు తనయుడు నాగార్జున కూడా ఒకరు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image3
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Related Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved