అనసూయ మేకప్‌పై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్.. అలా కనిపించడంతో ఫ్యాన్స్ గగ్గోలు..
హాట్ యాంకర్ అనసూయ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ఫ్యాన్స్ కి కనువిందు నిస్తుంటుంది. అయితే కొన్ని సార్లు విమర్శలను ఎదుర్కొంటుంది. తాజాగా మరోసారి ఆమె విమర్శలపాలయ్యింది.

`జబర్దస్త్` యాంకర్ అనసూయ ఇప్పుడు మరోసారి నెటిజన్లకి దొరికిపోయింది. మరోసారి ఆమె ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. షాకింగ్ కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అయితే అందులో నెగటివ్ విమర్శ కాకుండా అభిమానం కనిపిస్తుండటం విశేషం.
లేటెస్ట్ గా అనసూయ తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. ఎప్పటి మాదిరిగానే తను ఈ సారి కూడా హాట్ పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో మరింత హాట్‌గా ఉంది అనసూయ. వాటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వైరల్ అయ్యాయి.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ లేటెస్ట్ ఫోటోల్లో అనసూయ కనిపించే లుక్‌పైనే విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు. చూడ్డానికి ఇందులో ఆమె ఫేస్ మడతలుగా, కాస్త డిఫరెంట్‌గా ఉంది. మేకప్ సరిగా లేదు. జుట్టు కూడా వేరోలా ఉంది.
ఫోటోల్లో సరిగా పడలేదో, లేక అదొక స్టయిలో ఏమోగానీ, అది అభిమానులకు నచ్చలేదట. దీంతో కామెంట్లు చేస్తున్నారు. మేకప్ అస్సలు బాగా లేదని, ఎడిటింగ్ బాగా లేదని, చాలా డిజప్పాయింట్ అయ్యామని అంటున్నారు. కొందరైతే ఏజ్ బార్ అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ముసలిదానివి అవుతున్నావ్ అనసూయ అంటూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
అదేసమయంలో ఆమె ఏజ్‌పై అభిమానులు మరోలా స్పందిస్తున్నారు. 37ఏళ్లు వచ్చినా, అస్సలు ఏజ్ కనిపించడం లేదని, ఏజ్ పెరిగే కొద్ది అందం పెరుగుతుందంటున్నారు. మొత్తంగా అటు పాజిటివ్, ఇటు నెగటివ్ కామెంట్లతో అనసూయని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
చాలా వరకు అనసూయ వేసుకునే దుస్తులపై విమర్శలు వస్తుంటాయి. పొట్టి దుస్తులేసుకోవడం, అందాలు ఆరబోయడంపై స్పందిస్తుంటారు. విమర్శలు చేస్తుంటారు. అనసూయ కూడా వాటిపై గట్టిగానే రియాక్ట్ అవుతుంది. కౌంటర్లిస్తుంటుంది. మరి ఇప్పుడు ఈ లేటెస్ట్ కామెంట్లపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు టీవీ షోస్, మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతుంది. `జబర్దస్త్` షోతోపాటు `సూపర్ సింగర్స్ జూనియర్` కి హోస్ట్ గా చేస్తుంది. అలాగే త్వరలో మరో షోని ప్రారంభించబోతుంది.
ఇక నటిగా అరడజను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. `పుష్ప2`, `సింబా`, `దర్జా`, `వాంటెడ్ పండ్‌గాడ్` సినిమాలు చేస్తుంది. తమిళంలోనూ మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఓ వైపు టీవీని,మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది అనసూయ.