రాంచరణ్, అల్లు అర్జున్ సమక్షంలో సీక్రెట్ శాంటా సెలెబ్రేషన్స్ .. వైరల్ ఫోటోస్
మరోసారి కొణిదెల, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్కచోట కలిశారు. అయితే ఈ జనరేషన్ వాళ్ళు మాత్రమే. గతంలో దీపావళిని కలసి సెలెబ్రేట్ చేసుకున్న వీరు ఈసారి క్రిస్టమస్ సందర్భంగా శాంటా సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

మరోసారి కొణిదెల, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్కచోట కలిశారు. అయితే ఈ జనరేషన్ వాళ్ళు మాత్రమే. గతంలో దీపావళిని కలసి సెలెబ్రేట్ చేసుకున్న వీరు ఈసారి క్రిస్టమస్ సందర్భంగా శాంటా సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ ఈ ఫోటోలని షేర్ చేసింది.
ఈ సెలెబ్రేషన్స్ కి అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్, వరుణ్ తేజ్, నిహారిక, సుస్మిత, ఉపాసన, శ్రీజ హాజరయ్యారు. ఇటీవలే రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రిస్టమస్ వేడుకలు మెగా ఫ్యామిలిలో మరింత స్పెషల్ కాబోతున్నాయి.
రాంచరణ్, అల్లు అర్జున్ సింపుల్ అండ్ స్టైలిష్ గా మెరిశారు. ఎప్పటిలాగే నిహారిక, అల్లు స్నేహ, ఉపాసన అట్రాక్షన్ గా నిలిచారు. అల్లు స్నేహ తన ఇంస్టాగ్రామ్ లో మరికొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. తాను ఏ వేడుకలో అయినా తగ్గేదే లే అన్నట్లుగా అల్లు స్నేహ పిక్స్ అని అభిమానులతో పంచుకుంది.
రాంచరణ్ ఈ ఫోటోకి మెగా కజిన్స్ సీక్రెట్ శాంటా అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక అల్లు స్నేహ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్ అనేంతగా అల్లు స్నేహ గ్లామర్ తో డామినేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.