MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్యపై అమల కామెంట్స్.. మెగా ఫ్యామిలీని కూడా వదల్లేదుగా..

నాగ చైతన్యపై అమల కామెంట్స్.. మెగా ఫ్యామిలీని కూడా వదల్లేదుగా..

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన అమల.. కింగ్ నాగార్జునతో వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. తిరిగి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2022, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన అమల.. కింగ్ నాగార్జునతో వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. తిరిగి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మంచి అవకాశం వస్తే సిల్వర్ స్క్రీన్ పై తళుక్కున మెరుస్తున్నారు. తాజాగా అమల నటించిన లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం'. 

26

శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ వస్తోంది. టైం ట్రావెల్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమల కీలక పాత్రలో నటించారు. అమల నటన ఎమోషనల్ గా హృదయాల్ని హత్తుకునే విధంగా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. 

36

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. అమల, శార్వానంద్, అఖిల్ ముగ్గురూ కలసి వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కొక్కరి ఇష్టమైన వంటకాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో అమల.. చై అన్నయ్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అఖిల్ ని అడిగింది. 

46

స్వీట్ తో పాటు ఐస్ క్రీమ్ అంటే చై అన్నకి ఇష్టం అని అఖిల్ తెలిపాడు. మిడ్ నైట్ లో చై అన్న ఎలుకలాగా మారిపోతాడు. ఫ్రిజ్ లో చిన్న చిన్న ముక్కలు కొరికి పెట్టేస్తాడు అని అఖిల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తనకి కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని అఖిల్ తెలిపాడు. పక్కనే ఉన్న శర్వానంద్.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఐస్ క్రీమ్ తిని బతికేస్తున్నారు అని సెటైర్ వేస్తాడు. 

56

చిరంజీవి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అమల అడగగా.. స్టీమ్ దోస అని అఖిల్ చెబుతాడు. రాంచరణ్ కి పప్పు అప్పడం, ఎన్టీఆర్ కి హలీం అంటూ ఇలా స్టార్ హీరోల ఫుడ్ హాబిట్స్ గురించి వీరి మధ్య చర్చ జరుగుతుంది. 

66

ప్రభాస్ ని కలిసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏకంగా 30, 40 వంటకాలు మనముందు పెట్టేస్తాడు. ఇలా సరదాగా వీరిమధ్య వంటకాల గురించి చర్చ జరిగింది. ఒకే ఒక జీవితం స్పెషల్ స్క్రీనింగ్ కి కింగ్ నాగార్జున, అఖిల్, అమల కలసి హాజరయ్యారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ చూసి నాగార్జున కూడా భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా శర్వానంద్ కి చాలా రోజుల నుంచి ఊరిస్తున్న విజయం ఈ చిత్రంతో దక్కింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah Bhatia: కోటి రూపాయల పరిహారం కేసులో షాక్, ఫైన్ కట్టమన్న హైకోర్టు
Recommended image2
Sridevi: 9 కోట్లు పెట్టి భార్య, తమ్ముడితో సినిమా.. 1993లో అతిపెద్ద డిజాస్టర్‌
Recommended image3
Horror Comedy: ఓటీటీలో తప్పక చూడాల్సిన 6 హారర్ కామెడీ చిత్రాలు.. దెయ్యం సినిమాతో హీరోయిన్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved