MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: ఆత్మహత్య ప్రయత్నం చేసిన అఖిల్.. జానకికి ఇచ్చిన ఐదు అవకాశాలలో ఒకటి పోయినట్టేనా?

Janaki Kalaganaledu: ఆత్మహత్య ప్రయత్నం చేసిన అఖిల్.. జానకికి ఇచ్చిన ఐదు అవకాశాలలో ఒకటి పోయినట్టేనా?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

2 Min read
Author : Navya G
Published : Sep 19 2022, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి బాధపడుతూ జెస్సి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే స్థాయి వరకు వచ్చింది. ఇక్కడ అఖిల్ చూస్తే నాటకాలు ఆడుతున్నాడు. ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం తేవాలి అంటూ ఆలోచనలో పడుతుంది. ఇంతలో రామ వచ్చి, మీరు భయపడొద్దు జానకి గారు, అమ్మకి నిజం ఎలాగైనా నిరూపిద్దాము. ధైర్యంగా ఉండండి. ప్రతి మనిషిలో భయం అనేది ఉంటుంది. జెస్సీ జీవితం నాశనమైపోతుందేమో అని మీరు భయపడుతున్నారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఎక్కడ అమ్మ, అఖిల్ ని తిడుతుందేమో అని భయపడుతూ అఖిల్ నిజం దాస్తున్నాడు.నేను ఎంత ధైర్యం చెప్పిన సరే అసలు వినడం లేదు.మరి దీనికి ఇంకేం పరిష్కారం లేదా అని రామా అనగా, డిఎన్ఎ టెస్ట్ ఉన్నది రామ గారు అని జానకి అనగా అంటే ఏంటండి అని అడుగుతాడు రామ. అఖిల్ రక్తం తీసుకొని అది జెస్సి ఒంట్లో ఉన్న బిడ్డకు మ్యాచ్ చేస్తే, ఆ రెండు ఒకటి అవుతాయి అని మనకు ఒక రిపోర్టు వస్తుంది. అది అత్తయ్య గారికి చూపించాలి కానీ అఖిల్ రక్తం ఎలా దొరుకుతుంది? అత్తయ్య గారు ఒప్పుకోరు అని అనగా అమ్మని నేను ఒప్పిస్తాను జానకి గారు అని అంటాడు రామా.
 

36

ఆ తర్వాత సీన్ లో జ్ఞానాంబ, జానకి పరీక్ష రాయకపోవడం గురించి ఆలోచిస్తూ, జానకి పరీక్ష రాస్తుంది అనుకున్నాను కానీ నా మాట దాటింది.పరీక్ష రాయమన్నాను రాయలేదు అని బాధపడుతూ ఉంటుంది.అప్పుడు గోవిందరాజు జానకి అంత గట్టిగా చెప్తుందంటే ఒకసారి ఆలోచించు జ్ఞానం.ఎందుకంటే జానకి ఎప్పుడు మనల్ని ఎదురుపట్టలేదు అని అంటాడు.ఇంతలో మల్లిక వచ్చి అఖిల్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలి అనుకుంటున్నాడు తలుపు వేసేసుకున్నాడు అని అంటుంది.ఇంట్లో వాళ్ళందరూ పరిగెట్టి అఖిల్ దగ్గరికి వెళ్తారు.
 

46

అప్పుడు అఖిల్, నేను చచ్చిపోతాను. నేను చేయని తప్పుకు నాకు ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నారు నాకు ఇంకా బతకాలని లేదు అని అరుస్తాడు. ఇంతలో రామా తలుపుని గట్టిగా బద్దలు కొట్టి లోపలికి వెళ్లి అఖిల్ బయటకు తీసుకొని వస్తాడు. అప్పుడు ఎందుకు ఇలా చేశావు అని జ్ఞానాంబ అడగగా, నిజంగా నేనేమి తప్పు చేయలేదు అమ్మ వీళ్ళందరూ నన్ను అబద్ధం చెప్తున్నాను అని నమ్ముతున్నారు.ఇప్పుడు జానకి వదిన నాకు డిఎన్ఎ టెస్ట్ చేయించాలనుకుంటుంది అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా.
 

56

వదిన కంటే నేను సరిగ్గా తెలీదు అనుకున్నాము,పోనీ అన్నయ్య కూడా వదిన తోనే చేయి కలిపి నన్ను నమ్మడం లేదు. నేను ఏం తప్పు చేయలేదమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జ్ఞానం నిజంగా నువ్వు టెస్ట్ చేయాలనుకున్నావా జానకి అని అడగగా, అవును అత్తయ్య గారు కానీ..అని మాట పూర్తి అవ్వకముందే,ఇంకా చాలు జానకి నువ్వు క్షమించరాన్ని తప్పు చేశావు. ఇంత చెప్తున్నా సరే వాడి మీద నీకు నమ్మకం లేకుండా ఎవరో పరాయి అమ్మాయిని నమ్ముతున్నావేంటి? అయినా నువ్వు నా మాట దాటావు.
 

66

ఇంటి కోడలుగా కాకుండా పోలీస్ బుద్ధితో ఆలోచించి అఖిల్ కి టెస్ట్ చేయాలనుకున్నావు.నేను ముందే చెప్పాను మన ఇంట్లో వాళ్లే మనకి ముఖ్యం, ఇంట్లో అనుబంధాలకి గౌరవం ఇవ్వాలి అని కానీ నువ్వు దాన్ని వినిపించుకోలేదు.నువ్వు ఇలా తప్పులు చేసుకుంటూ వెళ్తే చాలా కష్టం. నేను ఇప్పుడు ఒక అవకాశాన్ని చెరిపేస్తున్నాను అని వెళ్లి ఒక అవకాశాన్ని జరిపేస్తుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి రామాలు అందరూ బాధపడుతూ ఉంటారు. మల్లిక చాలా గెంతులు వేస్తూ, హమ్మయ్య ఒకటి చెరిపేసింది పోలేరమ్మ. మిగిలిన నాలుగు కూడా చేరిపించేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటుంది. అప్పుడు జానకి బాధపడుతూ ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image2
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Recommended image3
Tollywood Top 5 Debuts: నితిన్ నుంచి రాంచరణ్ వరకు.. ఐదుగురిలో అతడొక్కడే నెక్స్ట్ లెవల్, కాదనగలరా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved