MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒంటరిగా ఉన్నా, చంపే ధైర్యం ఉంటే రా..పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి ఇచ్చిపడేసిన లయ

ఒంటరిగా ఉన్నా, చంపే ధైర్యం ఉంటే రా..పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి ఇచ్చిపడేసిన లయ

లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ హీరో నితిన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రంలో లయ నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2024, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అచ్చతెలుగు అందం లయ స్వయంవరం, మనోహారం, పెళ్ళాంతో పనేంటి, విజయేంద్ర వర్మ లాంటి చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లయ తెలుగు వారందరికీ సుపరిచయమే. ఆ తర్వాత లయ.. గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.   

27

త్వరలో లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ హీరో నితిన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రంలో లయ నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. లయ పాత్ర చుట్టే ఈ చిత్ర  కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

37

సినిమాల్లోకి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో లయ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఆమె కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా అనే షోకి అతిథిగా హాజరైంది. ఈ షో ప్రోమో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే అలీ సరదాగా జోకులు వేస్తూ.. కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడా అడిగాడు. 

47
Laya Gorty

Laya Gorty

తన అమెరికా జీవితం గురించి వచ్చిన రూమర్స్ పై లయ ఈ ఇంటర్వ్యూలో బాగా సీరియస్ అయినట్లు ఉంది. అదే విధంగా అలీతో కలసి నటించిన చిత్రాలని కూడా లయ గుర్తుచేసుకుంది. తన సినీ కెరీర్ లో కొన్ని తప్పులు చేసినట్లు కూడా లయ అంగీకరించింది. అందులో మొదటి తప్పు.. స్వయంవరం లాంటి సూపర్ హిట్ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో మా బాలాజీ అనే చిత్రంలో నటించడమే అని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

57
Laya Gorty

Laya Gorty

కోడి రామ కృష్ణ గారు స్టార్ డైరెక్టర్ కావడంతో ఆయన అడిగితే నో చెప్ప కూడదు అనే ఒకే ఒక్క కారణంతో ఆ సినిమా చేశాను. మంచి హిట్ పెద్ద తర్వాత తాను నటించిన చెత్త సినిమా అది అని లయ పేర్కొంది. ఆ తర్వాత లయ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటన గురించి అలీ ప్రశ్నించాడు. ఎయిర్ పోర్ట్ లో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న డైరెక్టర్ ఒకరు లయపై దాడికి ప్రయత్నించాడట. దీని గురించి ప్రోమోలో కంప్లీట్ వివరాలు తెలపలేదు. 

67
Laya Gorty

Laya Gorty

బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఉండగా పార్కింగ్ ప్లేస్ లో ఆయా డైరెక్టర్ నన్ను ఆపాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళతావో చూస్తా అని అన్నాడు. ఫాలో అయ్యాడు. నేను ఒక్కటే సమాధానం ఇచ్చా. ఇక్కడ ఎవరూ లేరు.. నేను ఒంటరిగా ఉన్నా. మీరు చంపుతా అంటే వచ్చి చంపండి చూద్దాం అంటూ లయ ఎదురుతిరిగిందట.

77

తాజాగా గ్రేకలర్ ప్రింటెడ్ శారీలో సీనియర్ నటి మరింత అందంగా  కనిపిస్తోంది. చీరకట్టులో హోయలు పోతూ నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. తన అందంతో ఇప్పటికీ ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
Recommended image2
Dhurandhar 2 Review: రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 చూసిన హీరోయిన్.. ఫస్ట్ రివ్యూ ఏంటో తెలుసా?
Recommended image3
Heroines Love Stories: డేటింగ్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. క్రేజీగా ఈ స్టార్ హీరోయిన్ల లవ్ స్టోరీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved