MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి దూరంగా నరేష్.. కారణం ఇదే

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి దూరంగా నరేష్.. కారణం ఇదే

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం 200 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 27 2025, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Naresh

Naresh

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం 200 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ కి అసలైన పండగ కళ తీసుకువచ్చింది. 

 

24

సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రేక్షకులతో సక్సెస్ ని పంచుకుంటున్నారు. రీసెంట్ గా భీమవరంలో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హైలైట్ అవుతున్నారు. బుల్లిరాజు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్ర సక్సెస్ ఈవెంట్స్ లో నరేష్ మిస్ అవుతున్నారు. అసలు ఆయన ప్రచార కార్యక్రమాలకు, ఈ చిత్రానికి దూరంగా ఉంటున్నారు. 

 

34

ఈ చిత్రంలో నరేష్ సీఎంగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గతంలో నరేష్ తన ప్రతి చిత్ర ప్రచార కార్యక్రమానికి హాజరయ్యేవారు. దీని గురించి నరేష్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పబ్లిసిటీ అవసరం లేదు. ఆ మూవీకి అదే పబ్లిసిటీ. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించా అని నరేష్ అన్నారు. 

 

44

తాను ప్రస్తుతం 9 చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాను అని తెలిపారు. అందువల్లే ఏ చిత్రాల ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. నెలలో 28 రోజులు బిజీగా ఉంటున్నానని.. ఇంత బిజీగా ఉన్నా సినిమాలే తనకి ఎనర్జీ అని నరేష్ పేర్కొన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?
Recommended image2
Trisha Krishnan: వివాదాలను దాటి దూసుకెళ్తున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌ రచ్చ చేస్తోందిగా?
Recommended image3
VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved