MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Karate Kalyani: మంచి భర్త దొరికితే అదృష్టం నా జన్మకు అది లేదు... ఇప్పటికీ పిల్లల్ని కనాలని ఉంది 

Karate Kalyani: మంచి భర్త దొరికితే అదృష్టం నా జన్మకు అది లేదు... ఇప్పటికీ పిల్లల్ని కనాలని ఉంది 

ఏదో ఒక వివాదంలో ఉండకపోతే కరాటే కల్యాణి(Karate Kalyani)కి బహుశా నిద్రపట్టదేమో. తాజాగా ఆమె సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె సుదీర్ఘ సందేశంలో మగజాతిని ఆడిపోసుకున్నారు. అదే సమయంలో ఆడవాళ్లను హెచ్చరించారు. మగాళ్ల మాయలో పడొద్దు అంటూ హితవు పలికారు.

3 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 24 2022, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Karate Kalyani

Karate Kalyani


‘నీ అంత మంచి మనిషి లేదు.. నువ్వు తోపు తురుము అని నీతో జీవితాంతం ఉంటా.. లేదంటే చచ్చిపోతా అని నిన్ను ముగ్గులోకి దించేదీ వాడే.. మోజు తీరాక అంటే కొంతకాలం లవ్ ట్రాక్ నడిపిన తరువాత నీ డామినేషన్ ఏంటి? మూసుకొని కూర్చో.. లేదా వేరే పెళ్లిచేసుకుంటా.. ఎక్కువ మాట్లాడకు అంటాడు. అప్పటికీ నువ్వు వాడి మత్తులో ఉంటావ్.. పిచ్చిదానిలా.. నువ్వు చెప్పింది చేస్తా నాన్న కన్నా నన్ను వదలకు అని ప్రాధేయపడి వాడికి సొమ్ములు ఇస్తావ్.. అడుగులకు మడుగులు ఒడ్డి.. అతనితోనే ఉంటావ్..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక అప్పటి నుంచి మొదలు సారు ప్రతాపం.. ఏంటి? ఆ బట్టలు? ఆ జుట్టు అలా ఉంది ఏంటి? ఇంతసేపు ఎక్కడకి వెళ్లావ్.. వాడెవడు నీతో మాట్లాడుతున్నాడు? అందరితోనూ మాటలా? మీ తమ్ముళ్లు... మీ అమ్మ నాన్న ఎవ్వరూ రాకూడదు. సినిమా నేను తీసుకెళ్తే రావాలి.. పిల్లలు పుట్టాక పని మానేయాలి..ఇలా ఒకటా రెండా .. అనుమానం ముందు పుట్టి వీడు వెనుక పుట్టాడా? అన్నట్టుగా.. ఇలా చిత్ర హింసలు చేసి చివరికి కొన్ని సంవత్సరాలు భరించి ఓపిక అయిపోతే వదిలి వచ్చేస్తారు. మీరు మోసం చేసి.. ఆడవాళ్ళు మోసం చేశారని అంటారు.
 

37

తాగి వచ్చి కొడతారు.. ఒకటా రెండా.. డబ్బులు కావాలి అంటే మాత్రం మామూలుగా ఉండదు. కొందరికి అందం దేవుడు ఇచ్చిన వరం.. అదే శాపం కూడా అవుతుంది కొంతమందికి ఏమిచేస్తాం. ఇలా మనం ప్రేమ దోమా అనగానే పడిపోతే ఇలాగే ఉంటుంది. వీళ్ళని ఎక్కడ త...న్నా..లో మరి.మనసుతో ఆడుకొనే మగాళ్లతో ఉండేకన్నా సోలోగా బ్రతకడం బెస్ట్. నాకు తెలిసీ ఇందులో నాకు జరిగినవి ఉన్నాయి. ప్రతి అమ్మాయికిజరుగుతాయి. కానీ మేము మనుషులం ఎప్పటికీ అర్థం అవుతుంది. నాన్న ప్రేమ తప్పా ఇంకేది శాశ్వతంగా ఉండదు.

47

మగాళ్లు వట్టి మాయగాళ్లు.. ఇదే నిజం.. నిజంగా మంచి భర్త దొరికితే అదృష్టం అంటారు. నాకు ఈ జన్మకి అది లేదు. అనుకొని బ్రతికే నన్ను కెలికింది నా స్నేహితురాలు. ఒసేయ్ మీ ఆయన కూడా దొంగ కాబట్టి అవకాశం రానంత వరకు అమాయకులు.. వస్తే చూపిస్తారు తడాఖా. ఇంకొందరు అయితే .. నాదే తప్పా.. నువ్వు ఆనందించావు కదా అనేవాళ్ళు ఉంటారు వెర్రిదానా.. రాస్తే మీ మా ఇంటి కథలు పెద్ద పుస్తకం రాయొచ్చు గానీ.. మంచి వాళ్ళు ఇంకా మంచివారుగా మారండి.. మీ భార్యల కష్టం కాస్త చూడండి.

57

మూడో వాడు ఏమనుకుంటారో అని ఆలోచన వస్తే విడిపోతారు. ఇదే నిజం.. వచ్చే జన్మ ఉంటే ఆ జన్మలో నాకు నా అందాల రా రాజు రావాలని ఎదురు చూస్తా.. తప్పుకాదుగా.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకో అనకండి.. వచ్చేవాడికి ఇలాంటి పోరాటాలు నచ్చవు. ఒకవేళ నచ్చేవాడు వస్తే మనవాళ్ళు నువ్వు చేసుకోకూడదు అని అనేస్తారు ట్రోలింగ్‌లో. నేను మంచి గయ్యాళిని కదా ప్రపంచంలో ఎవ్వరికీ నచ్చను. ఈరోజు బాగా బాధ పెట్టిన నా స్నేహితురాలుకి గట్టిగా క్లాస్ పీకాను. కోపం వస్తుంది బాధా అన్ని కలిపి ఈపోస్ట్ పెట్టాను. తప్పుగా ఎవరికైనా అనిపిస్తే నేను బాధ్యురాలిని కాదు.. ప్రేమ గీమ ఇలాంటి తొక్కలో కమిట్మెంట్ పెట్టుకోవద్దు.. అర్థమైందా పిల్లా.. ఇది నీకే.. ఇక ఉంటా’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి.

67

ఆమె సోషల్ మీడియా సారాంశం ఏంటంటే.. మగాళ్లు మొదట్లో బుజ్జి కన్నా అంటూ మాయలో పాడేసుకుంటారు. నీకు మానసికంగా, శరీరకంగా దగ్గరవుతారు. ఎప్పుడైతే నువ్వు అతన్ని ప్రేమించడం మొదలుపెడతావో అసలు రూపం బయటికి తీస్తారు. నీపై లేనిపోని కండీషన్స్ పెడతారు. వినకపోతే వదిలేస్తానని భయపెడతారు. తాగొచ్చి కొడతారు. డబ్బుల కోసం హింసిస్తారు. మన అందమే మన శత్రువు. ఆ అందం కోసం మనకు దగ్గరైన మగాళ్లు మనల్ని లోబరుచుకుని తర్వాత హింసిస్తారంటూ... అమ్మాయిలకు కరాటే కళ్యాణి హిత బోధ చేసింది.

77


కరాటే కళ్యాణి ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరితో కూడా ఆమెకు పొసగలేదు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. కానీ కరాటే కళ్యాణికి తల్లి కావాలనే ఆశ బలంగా ఉందట. మళ్ళీ పెళ్లి చేసుకొని తల్లి కావాలనేది ఆమె కోరిక అట. తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో ఉంటే చికిత్స చేయించుకున్నాను. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న కరాటే హౌస్ నుండి బయటకు వచ్చాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved