MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

Abhishek Sharma: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం రేపే ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
30 బంతుల్లోనే రికార్డు సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
Image Credit : X/BCCI

30 బంతుల్లోనే రికార్డు సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా యువ సంచలనం, ఓపెనర్ అభిషేక్ శర్మ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లకు నరకం చూపించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో బంతిని నలువైపులా బాదుతూ వీరవిహారం చేశాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని, అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు.

ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట చాలా కాలంగా ఉన్న తొమ్మిదేళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం 34 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్, 9 ఫోర్లు, 11 భారీ సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ మార్కు అందుకున్నాక పిచ్‌పై ధ్యానం చేస్తున్నట్లు కూర్చుని 'ఎర్లింగ్ హాలాండ్' మార్క్ స్టైల్‌లో సంబరాలు చేసుకోవడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోహిత్ శర్మ 9 ఏళ్ల రికార్డు బద్దలు
Image Credit : ANI

రోహిత్ శర్మ 9 ఏళ్ల రికార్డు బద్దలు

2017లో శ్రీలంకపై ఇండోర్ లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చాలామంది భారత బ్యాటర్లు ప్రయత్నించినా ఆ రికార్డు చెక్కుచెదరలేదు. కానీ, అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిషేక్ శర్మ ఆ రికార్డును చాలా సునాయసంగా దాటేశాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకోవడమే కాకుండా, టెస్ట్ హోదా ఉన్న దేశాల పరంగా చూస్తే ప్రపంచంలోనే అతివేగవంతమైన టీ20 సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది మూడో అతివేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం.

36
పవర్‌ప్లేలో ప్రపంచ రికార్డు.. బాహుబలి హిట్టింగ్
Image Credit : ANI

పవర్‌ప్లేలో ప్రపంచ రికార్డు.. బాహుబలి హిట్టింగ్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అభిషేక్ శర్మ ఊహించని రేంజ్ ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాచ్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఉతికేశాడు. పవర్‌ప్లేలోని మొదటి 6 ఓవర్లలోనే అభిషేక్ శర్మ 22 బంతుల్లో ఏకంగా 76 పరుగులు రాబట్టాడు. దీంతో పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లే సమయంలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ప్రపంచ రికార్డు అభిషేక్ ఖాతాలో చేరింది. గతంలో పోర్చుగల్ ఆటగాడు కుల్దీప్ ఘోలియా (74 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ఇతను అధిగమించాడు. అంతేకాకుండా, పవర్‌ప్లేలో ఒక క్యాలెండర్ ఇయర్ (2026)లో అత్యధికంగా 37 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా తన పేరిటే మరింత పెంచుకున్నాడు.

46
20 బంతుల్లోపు 6వ హాఫ్ సెంచరీ
Image Credit : ANI

20 బంతుల్లోపు 6వ హాఫ్ సెంచరీ

ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం అభిషేక్‌కి ఇది ఆరోసారి. ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా ఇన్నిసార్లు అంత వేగంగా హాఫ్ సెంచరీలు చేయలేదు. అంతకుముందు న్యూజిలాండ్‌పై 14 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన రికార్డు కూడా ఇతని పేరిటే ఉంది. యువరాజ్ సింగ్ (12 బంతులు) తర్వాతి స్థానాల్లో అభిషేక్ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతోంది.

56
విరాట్ కోహ్లీ సరసన అభిషేక్ శర్మ
Image Credit : ANI

విరాట్ కోహ్లీ సరసన అభిషేక్ శర్మ

ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ శర్మకి ఇది 10వ సెంచరీ. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత దిగ్గజం విరాట్ కోహ్లీ సరసన అత్యున్నత స్థానంలో నిలిచాడు. మరో ఒక్క సెంచరీ చేస్తే కోహ్లీని దాటి భారత్ తరఫున ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్తాడు. అలాగే ఈ 3వ టీ20I మ్యాచ్‌లో 11 సిక్సర్లు బాదడం ద్వారా, ఈ సిరీస్‌లో ఇతను కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 22కి చేరింది. ఒకే టీ20 సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తన పాత రికార్డును (2025లో ఇంగ్లాండ్‌పై 22 సిక్సర్లు) అభిషేక్ మళ్ళీ సమం చేశాడు.

66
టిమర్శకులకు బ్యాట్‌తోనే ఘాటు సమాధానం ఇచ్చిన అభిషేక్ శర్మ
Image Credit : BCCI

టిమర్శకులకు బ్యాట్‌తోనే ఘాటు సమాధానం ఇచ్చిన అభిషేక్ శర్మ

ఈ సిరీస్‌కు ముందు అభిషేక్ శర్మ వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో సరైన పరుగులు చేయక తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దానికితోడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. అయితే, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో (82, 39, 108) అద్భుతమైన ఫామ్‌తో చెలరేగి తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నాడు. ముఖ్యంగా స్పిన్‌ను ఆడలేడనే విమర్శలకు రషీద్ ఖాన్, ముజీబ్ బౌలింగ్‌లోనే భారీ సిక్సర్లు కొట్టి సమాధానమిచ్చాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved