MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు

Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు

Abhishek Sharma: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత జట్టు సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ టీమ్ పై ధనాధన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ టీ20ల్లో 6000 పరుగుల మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 14 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మ విధ్వంసం: ఢిల్లీలో రికార్డుల మోత
Image Credit : X/BCCI

అభిషేక్ శర్మ విధ్వంసం: ఢిల్లీలో రికార్డుల మోత

భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిపిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. తన కెరీర్‌లో మరో మైలురాయి దాటేశాడు. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 6000 పరుగులు పూర్తి చేసిన రెండో ప్రపంచ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంతుల లెక్కన వరల్డ్ రికార్డ్: ఆండ్రీ రస్సెల్‌నే దాటేసిన అభిషేక్ శర్మ
Image Credit : X/BCCI

బంతుల లెక్కన వరల్డ్ రికార్డ్: ఆండ్రీ రస్సెల్‌నే దాటేసిన అభిషేక్ శర్మ

పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదంగా మారిన అభిషేక్ శర్మ 6000 టీ20 పరుగులను చేరుకోవడానికి కేవలం 3420 బంతులు మాత్రమే తీసుకున్నాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ (3386 బంతులు) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు. ఈ ఘనత సాధించే క్రమంలో విండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (3550 బంతులు), ఆస్ట్రేలియా ప్లేయర్ టిమ్ డేవిడ్ (3681 బంతులు), ఇంగ్లాండ్ స్టార్స్ విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ (3857 బంతులు)లను అభిషేక్ వెనక్కి నెట్టేశాడు. గతంలోనే వేగంగా 5000 టీ20 పరుగులు, 1000 T20I పరుగులు చేసిన రికార్డులు కూడా ఇతని ఖాతాలోనే ఉండటం విశేషం.

35
తొలుత తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్‌: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అర్షదీప్
Image Credit : X/BCCI

తొలుత తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్‌: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అర్షదీప్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టుకు భారత బౌలర్లు గట్టి షాకే ఇచ్చారు. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ పరుగులేమీ చేయకుండానే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్‌ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అయితే అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (44 బంతుల్లో 64 నాటౌట్), నిలకడగా ఆడిన మహ్మద్ నబీ (27 బంతుల్లో 33) 83 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో చెలరేగగా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ 156 పరుగులకే పరిమితమైంది.

45
22 బంతుల్లోనే ఫిఫ్టీ: ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లకు నరకం చూపించిన అభిషేక్
Image Credit : X/BCCI

22 బంతుల్లోనే ఫిఫ్టీ: ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లకు నరకం చూపించిన అభిషేక్

157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ (8 పరుగులు) త్వరగానే అవుట్ అయినా, ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా అభిషేక్ శర్మ కంట్రోల్‌లోకి వచ్చింది. మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడిన అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 32 బంతులు ఎదుర్కొన్న ఇతను 82 పరుగులతో వీరవిహారం చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 42 పరుగులతో చక్కటి సహకారం అందించాడు.

55
మొదటి T20లో భారత్ ఘన విజయం: సిరీస్‌లో 1-0 ఆధిక్యం
Image Credit : X/BCCI

మొదటి T20లో భారత్ ఘన విజయం: సిరీస్‌లో 1-0 ఆధిక్యం

అభిషేక్ శర్మ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓపెనర్లు వేసిన బలమైన పునాదితో భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని ఛేదించింది. చివరిలో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మిగిలిన పని పూర్తి చేయడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Recommended image2
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image3
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Related Stories
Recommended image1
Train Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కన్ఫర్మ్ కావాలా? ఈ ఐదు సీక్రెట్ ట్రిక్స్ మీకోసం
Recommended image2
Top 5 Largest Ganesha Temples: ప్రపంచంలోనే ప్రముఖ, అతిపెద్ద గణపతి ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved