MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?

Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?

వ్యాపారం మొదలుపెట్టాలనుకునే లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళలకు SBI 'స్త్రీ శక్తి' పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ కింద లోన్ కావాలంటే కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్లు, ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 29 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్బిఐ స్త్రీ శక్తి స్కీమ్
Image Credit : Gemini AI

ఎస్బిఐ స్త్రీ శక్తి స్కీమ్

చాలా మంది మహిళలకు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఇందుకు పెట్టుబడిగా కావాల్సిన డబ్బును సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇలాంటి మహిళలకు సహాయం చేసేందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'స్త్రీ శక్తి యోజన' అనే ప్రత్యేక రుణ పథకాన్ని అమలు చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహిళా వ్యాపారులకు బంపరాఫర్
Image Credit : Gemini AI

మహిళా వ్యాపారులకు బంపరాఫర్

మహిళలు నడిపే అనేక రకాల వ్యాపారాలకు ఈ లోన్ ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్రొడక్షన్, క్యాటరింగ్, రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు వంటి తయారీ, అమ్మకం, సేవా రంగాలకు చెందిన వ్యాపారాలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అంటే కొత్త మిషనరీలు కొనడానికి లేదా రోజువారీ ఖర్చుల కోసం కూడా ఈ లోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

35
ఏకంగా రూ.25 కోట్ల లోన్..
Image Credit : getty

ఏకంగా రూ.25 కోట్ల లోన్..

ఈ పథకం కింద అవసరాన్ని బట్టి గరిష్ఠంగా రూ. 25 కోట్ల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. అయితే అందరికీ ఇంతే మొత్తం ఇవ్వరు. వ్యాపారం స్వభావం, దాని పరిమాణం, లోన్ అవసరం, దరఖాస్తుదారురాలి అర్హత వంటి అంశాలను బ్యాంకు పరిశీలించిన తర్వాతే తుది లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. ఇందులో వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్ వంటివి ఉంటాయి.

45
వడ్డీ రాయితి
Image Credit : AI Image

వడ్డీ రాయితి

ఈ పథకంలో వడ్డీ రాయితీ కూడా ఒక ముఖ్యమైన అంశం. రూ. 2 కోట్ల వరకు తీసుకునే రుణాలపై గరిష్ఠంగా 0.50 శాతం వరకు వడ్డీ రాయితీ లభించే అవకాశం ఉంది. దీనివల్ల లోన్‌పై వడ్డీ భారం కొంత తగ్గుతుంది. అయితే వర్తించే వడ్డీ రేటు, ఇతర ఛార్జీలు బ్యాంకు నిబంధనల ప్రకారమే ఉంటాయని గుర్తుంచుకోవాలి.

55
ఈ లోన్ కోసం వెంటనే అప్లై చేయండి
Image Credit : Asianet News

ఈ లోన్ కోసం వెంటనే అప్లై చేయండి

లోన్ రకం, వ్యాపార అవసరాన్ని బట్టి తిరిగి చెల్లించే సమయం మారుతుంది. టర్మ్ లోన్‌లకు సాధారణంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు గడువు ఉండవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ నిబంధనలు వ్యాపారానికి సంబంధించిన నగదు ప్రవాహాన్ని బట్టి ఉంటాయి. లోన్ తీసుకునేటప్పుడు వ్యాపార పరిమాణాన్ని బట్టి 15 నుంచి 25 శాతం వరకు మార్జిన్ మనీ అవసరం కావచ్చు.

ఈ లోన్ కోసం SBI బ్రాంచ్‌లో లేదా బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఆధార్, పాన్ కార్డ్ వంటి KYC డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూఫ్, బిజినెస్ ప్లాన్ రిపోర్ట్ అవసరం. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు గత 3 ఏళ్ల ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఐటీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోన్ అనేది ఉచిత ఆర్థిక సహాయం కాదు. లోన్ మొత్తం, వడ్డీ, ఛార్జీలు, తిరిగి చెల్లించే నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే అప్లై చేయడం మంచిది. వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, ఖర్చులు, నెలవారీ వాయిదాలు చెల్లించగలమా లేదా అని బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
మహిళలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
Home Loan : హోమ్ లోన్ కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
Recommended image2
Gold Loan : ఇండియాలో గోల్డ్ లోన్స్ అత్యధికంగా తీసుకునే రాష్ట్రమేది? ఏపీ, తెలంగాణ స్థానమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved