MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Home Loan : హోమ్ లోన్ కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?

Home Loan : హోమ్ లోన్ కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?

సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నెరవేర్చుకోవడానికి చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. కానీ లోన్ గడువు ముగియకముందే అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ అప్పు ఎవరు కట్టాలి? హోంలొన్ కి ఇన్సూరెన్స్ ఉంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 04 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకులు ఏం చేస్తాయి?
Image Credit : Getty

హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకులు ఏం చేస్తాయి?

సొంత ఇల్లు అనేది చాలామందికి జీవితకాలపు కల. ధనవంతులకు ఇది పెద్ద విషయం కాదు కానీ సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కట్టడం చాలా పెద్ద విషయం... అందుకే ''ఇల్లు కట్టిచూడు, పెళ్లి చేసిచూడు'' అని పెద్దలు అనేవారు. అంటే జీవితంలో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా కష్టతరమైన పనులన్నమాట… వీటికి భారీగా డబ్బులు ఖర్చు అవడమే కాదు శారీరక, మానసిక శ్రమ ఉంటుంది.

అయితే ఇటీవల కాలంలో ఇల్లు కట్టడం చాలా ఈజీ అయిపోయింది. ఇల్లు కట్టుకోడానికి బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, కాంట్రాక్టర్లు మనకు కష్టం లేకుండానే రెడీ చేసి ఇస్తున్నారు... ఇంకేముంది నేరుగా ఫ్యామిలీతో ఇంట్లోకి వెళ్లడమే. కొత్త ఇంటి కలను నెరవేర్చుకోవడం హోమ్ లోన్ తో చాలా ఈజీ అయిపోయింది.

ఇటీవల కాలంలో ఉద్యోగులు, వ్యాపారులు తమ ఆదాయాన్ని బట్టి 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితితో బ్యాంకుల్లో హోమ్ లోన్లు తీసుకోవడం సాధారణమైపోయింది. అయితే ఇక్కడ మనందరికి ఒక డౌట్ వస్తుంది... 15-30 ఏళ్లు అంటే చాలా ఎక్కువ కాలం... ఈ మధ్యలో ఊహించని విధంగా హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాంకు ఇంటిని వేలం వేయగలదా?
Image Credit : Chatgpt

బ్యాంకు ఇంటిని వేలం వేయగలదా?

హోంలోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి వారసులు అప్పు చెల్లించాలి. అంటే హోంలోన్ EMI యధావిధిగా కొనసాగించాలి. ఒకవేళ చాలాకాలం పాటు లోన్ చెల్లించకుండా, వాయిదాలు కట్టడం మానేస్తే బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. తాకట్టు పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. అవసరమైన చట్టపరమైన ప్రక్రియల తర్వాత ఆస్తిని వేలం వేయవచ్చు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో బకాయిలను రాబట్టుకుని, మిగిలిన మొత్తం ఉంటే చట్టపరమైన హక్కుదారులకు అందిస్తారు.

Related Articles

Related image1
Home Loan : ఇల్లు కొనకుండానే హోమ్ లోన్ తీసుకోవచ్చా..! ఎలాగో తెలుసా?
Related image2
Home Loan: హోమ్ లోన్ ఈఎంఐల నుంచి త్వరగా బయటపడటం ఎలా? ఈ స్మార్ట్ చిట్కాలు మీకోసమే..
35
జాయింట్ హోమ్ లోన్ (Joint Home Loan) అంటే ఏమిటి?
Image Credit : ANI

జాయింట్ హోమ్ లోన్ (Joint Home Loan) అంటే ఏమిటి?

భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కలిసి జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు. అంటే హోమ్ లోన్ ఇద్దరి పేరుమీద ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు మరణించినా లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లోన్ అగ్రిమెంట్ ప్రకారం EMI లు చెల్లించాల్సిన బాధ్యత రెండో వ్యక్తిపై ఉంటుంది. లోన్ కాలం పూర్తవకముందే ఇద్దరూ చనిపోతే వారి చట్టపరమైన వారసులు లోన్ చెల్లించాలి.

45
హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఉంటే?
Image Credit : Gemini AI

హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఉంటే?

చాలా బ్యాంకులు హోమ్ లోన్‌తో పాటు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (HLPP)  లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తాయి. ఇలాంటి భీమా ఉంటే హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా కుటుంబంపై ఆర్థికభారం పడదు. నిబంధనలకు లోబడి ఇన్సూరెన్స్ కంపెనీయే లోన్ మొత్తాన్ని చెల్లిస్తుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ షరతులు కంపెనీ, పాలసీని బట్టి మారుతూ ఉంటాయి.

ఒకవేళ ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోతే బ్యాంకు సాధారణంగా చట్టపరమైన వారసులను లేదా ఆస్తిని పొందిన వారిని సంప్రదిస్తుంది. వారే లోన్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం లోన్‌ను పునర్‌వ్యవస్థీకరించడం లేదా పేరు మార్పు చేయడం జరగవచ్చు.

55
హోమ్ లోన్ ముందస్తు ప్రణాళిక ఎందుకు ముఖ్యం?
Image Credit : Pixabay

హోమ్ లోన్ ముందస్తు ప్రణాళిక ఎందుకు ముఖ్యం?

హోమ్ లోన్ తీసుకునేటప్పుడే తగినంత లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి ఆలోచించడం మంచిది. ఇది ఊహించని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. మీరు ఎంతో ప్రేమించే మీ కుటుంబానికి ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది.

గమనిక : ప్రతి బ్యాంకు లోన్ అగ్రిమెంట్, ఇన్సూరెన్స్ పాలసీ, చట్టపరమైన పరిస్థితులు వేర్వేరుగా ఉండవచ్చు. మీ లోన్‌కు వర్తించే నిబంధనలను తెలుసుకోవడానికి సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ఉత్తమం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితం అంటే ఇదే.. విధి రాత‌ను మార్చ‌డం అసాధ్య‌మ‌ని చాటే గొప్ప క‌థ
Recommended image2
Primary School Age In USA: అమెరికాలో పిల్లలు ఏ వయసులో బడికి వెళ్తారో తెలుసా?
Recommended image3
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు
Related Stories
Recommended image1
Home Loan : ఇల్లు కొనకుండానే హోమ్ లోన్ తీసుకోవచ్చా..! ఎలాగో తెలుసా?
Recommended image2
Home Loan: హోమ్ లోన్ ఈఎంఐల నుంచి త్వరగా బయటపడటం ఎలా? ఈ స్మార్ట్ చిట్కాలు మీకోసమే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved