MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Loan : ఇండియాలో గోల్డ్ లోన్స్ అత్యధికంగా తీసుకునే రాష్ట్రమేది? ఏపీ, తెలంగాణ స్థానమెంత?

Gold Loan : ఇండియాలో గోల్డ్ లోన్స్ అత్యధికంగా తీసుకునే రాష్ట్రమేది? ఏపీ, తెలంగాణ స్థానమెంత?

దేశంలో ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే మొత్తం గోల్డ్ లోన్లలో 80 శాతానికి పైగా వాటా దక్షిణ భారతదేశానిదేనని కేంద్ర ఆర్థిక శాఖ లోక్‌సభలో వెల్లడించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానాలెంత?

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 11 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండియాలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్
Image Credit : AI

ఇండియాలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్

Gold Loan : రాజుల కాలం నుండి ఈ రోబోల కాలం వరకు భారతీయులు బంగారాన్ని అలంకరణకే కాదు ఆస్తిగా కూడా వాడతారు. ఆపద సమయంలో బంగారం అండగా నిలుస్తుందని చాలామంది నమ్మకం... అందుకే డబ్బులుంటే ఖర్చవుతాయని బంగారం కొంటుంటారు. ఏదైనా ఆర్థిక అవసరాలుంటే అదే బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బుగా మార్చుకుని వాడుకుంటారు. మళ్లీ డబ్బులు వచ్చాక ఆ బంగారాన్ని విడిపించుకుంటారు. ఇలా బంగారాన్ని తెలివిగా వాడుకుంటున్నారు.

అయితే ఒకప్పుడే కేవలం ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చేవారు... కానీ రానురాను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇతర సంస్థలు సైతం బంగారంపై రుణాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఇప్పుడు గోల్డ్ లోన్స్ అనేది పెద్ద వ్యాపారంగా మారిపోయింది.

ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే బంగారాన్ని ఎక్కువగా వాడతారు... అందుకే గోల్డ్ లోన్స్ విషయంలో ఈ రాష్ట్రాలే టాప్ లో ఉన్నాయి. దేశంలో ప్రజలు తీసుకునే గోల్డ్ లోన్లలో సింహభాగం సౌత్ ఇండియాదేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చే (PSB) మొత్తం గోల్డ్ లోన్లలో ఏకంగా 80 శాతానికి పైగా వాటా ఐదు దక్షిణాది రాష్ట్రాలదేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది.

లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్రం ఆర్థిక మంత్రి సభకు సమర్పించిన రిపోర్ట్ ప్రకారం... మార్చి 31, 2026 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.11.31 లక్షల కోట్లకు పైగా విలువైన గోల్డ్ లోన్లు బకాయిలుగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో లోన్లు ఉన్నప్పటికీ ఎగవేతలు (NPA - మొండి బకాయిలు) గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే విషయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాష్ట్రాల వారీగా గోల్డ్ లోన్స్ డిటెయిల్స్
Image Credit : ChatGPT

రాష్ట్రాల వారీగా గోల్డ్ లోన్స్ డిటెయిల్స్

ప్రభుత్వ రంగ బ్యాంకుల గణాంకాల ప్రకారం... గోల్డ్ లోన్ల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. ఏ రాష్ట్రంలో ప్రజలు ఎంత గోల్డ్ లోన్ తీసుకున్నారో తెలుసా?

తమిళనాడు : రూ.4 లక్షల కోట్లకు పైగా గోల్డ్ లోన్ బకాయిలతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ : రూ.2.22 లక్షల కోట్లకు పైగా గోల్డ్ లోన్ బకాయిలతో రెండో స్థానంలో నిలిచింది.

కర్ణాటక : రూ.98,000 కోట్లకు పైగా గోల్డ్ లోన్ బకాయిలతో మూడో స్థానంలో ఉంది.

తెలంగాణ : రూ.92,000 కోట్ల గోల్డ్ లోన్ బకాయిలతో నాలుగో స్థానంలో ఉంది.

కేరళ : రూ.83,000 కోట్లకు పైగా గోల్డ్ లోన్ బకాయిలతో ఐదో స్థానంలో ఉంది.

34
దక్షిణాదిలోనే గోల్డ్ లోన్లు ఎందుకింత ఎక్కువ?
Image Credit : Chatgpt

దక్షిణాదిలోనే గోల్డ్ లోన్లు ఎందుకింత ఎక్కువ?

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు గోల్డ్ లోన్స్ ఎక్కువగా తీసుకోడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ఇందులో కీలకమైంది ఈ రాష్ట్రాల ప్రజలు ఇళ్లలో ఎక్కువగా బంగారం నిల్వలు కలిగివుంటారు... శుభకార్యాలు, పండగలకు వాటిని వాడుతుంటారు. ఇలా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన బంగారం వాడకం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిగా కూడా బంగారాన్ని ఎక్కువగా కొనేది దక్షిణాదివారే.

ఇదిలావుంటే ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతుండటంతో తాకట్టు పెట్టే బంగారానికి వచ్చే లోన్ విలువ (Loan Value) కూడా బాగా పెరిగింది. కాబట్టి తక్కువ బంగారానికి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుండటంతో ప్రజలు గోల్డ్ లోన్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదికూడా దక్షిణాది రాష్ట్రాల్లో గోల్డ్ లోన్స్ పెరగడానికి మరో కారణం.

ఆర్‌బీఐ 'ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (జూన్ 2026)'ను ఉటంకిస్తూ… బంగారం ధరల పెరుగుదలే ఈ లోన్ల వృద్ధికి ముఖ్య కారణమని మంత్రి స్పష్టం చేసింది. దీనితో పాటు బ్యాంకులు, NBFCలు ఇచ్చే 'లోన్-టు-వాల్యూ' (LTV) నిష్పత్తి తగ్గింది. అంటే బంగారం విలువలో ఇచ్చే అప్పు శాతం తగ్గించారు. దీనివల్ల బ్యాంకులకు కొలేటరల్ బఫర్ పెరిగి, ధరల హెచ్చుతగ్గులను తట్టుకునే శక్తి పెరిగింది. ఫలితంగా లోన్ల నాణ్యత స్థిరంగా ఉందని ఆర్బిఐ పేర్కొంటోంది.

44
గోల్డ్ లోన్ కస్టమర్స్ ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..
Image Credit : Gemini AI

గోల్డ్ లోన్ కస్టమర్స్ ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

గోల్డ్ లోన్ కట్టని వారి బంగారాన్ని వేలం వేసి ఇబ్బంది పెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని కఠినమైన మార్గదర్శకాలు పెట్టింది. అవేంటంటే..

  • వేలానికి ముందు తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలి.
  • నగల ప్రస్తుత విలువలో కనీసం 90% రిజర్వ్ ధరగా నిర్ణయించాలి.
  • అప్పు పోగా మిగిలిన డబ్బును కస్టమర్‌కు తిరిగివ్వాలి.
  • వేలం, వాల్యుయేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి.
  • సర్వీస్ ఛార్జీల వివరాలను ముందే తెలియజేయాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంగారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?
Recommended image2
Indian Rupee: ఇండియా కాకుండా రూపాయి చెల్లే ఇతర దేశాలు ఏవో తెలుసా?
Recommended image3
జెన్‌జీలు ఇలాంటి సిప్ప‌ర్‌ల‌లో నీళ్లు ఎందుకు తాగుతున్నారు.? అస‌లు వీటి ఉప‌యోగం ఏంటి?
Related Stories
Recommended image1
Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా
Recommended image2
Gold Loan Auction : మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా? మీ బంగారం వేలం వేసే పరిస్థితి రావద్దంటే ఏం చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved