MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌

ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌

Electric Lunch Box: ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనం మ‌ధ్యాహ్నానికి చ‌ల్ల‌బ‌డుతుంది. అయితే అలా కాకుండా అప్ప‌టిక‌ప్పుడు ఆహారాన్ని వేడి చేసుకొని తింటే భ‌లే ఉంటుంది క‌దూ! అయితే ఈ ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్ తో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 16 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1.2 లీటర్ల సామర్థ్యం
Image Credit : Amazon.in

1.2 లీటర్ల సామర్థ్యం

అష్యూర్ (Assure) కంపెనీకి చెందిన ఈ ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్ అస‌లు ధ‌ర అమెజాన్‌లో రూ. 4995 కాగా 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 2499కి ల‌భిస్తోంది. ఈ లంచ్ బాక్స్‌లో 1.2 లీటర్ల సామర్థ్యం ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్ ఉంటుంది. రోజువారీ భోజనం తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. లోపలి కంటైనర్‌ను బయటకు తీసి శుభ్రం చేసుకోవచ్చు. ఆహారం పెట్టే భాగాన్ని ఫుడ్ గ్రేడ్ SS304 స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. దీంతో సాధారణ భోజనాన్ని ఇందులో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
200W హీటింగ్‌తో త్వరగా వేడి
Image Credit : amazon.in

200W హీటింగ్‌తో త్వరగా వేడి

ఈ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్‌లో 200 వాట్ల శక్తివంతమైన హీటింగ్ ఎలిమెంట్ ఉంది. ఇంటి నుంచి తీసుకొచ్చిన అన్నం, కూరలు, ఇతర ఆహార పదార్థాలను వేడి చేసుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు. రైస్ స్టీమింగ్, హాట్ రైస్, స్టూ వంటి మోడ్‌లను కూడా ఇందులో అందించారు. వంట చేయడం, ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకోవడం వంటి అవసరాలకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు.

35
డిజిటల్ డిస్‌ప్లే, పలు మోడ్‌లు
Image Credit : amazon.in

డిజిటల్ డిస్‌ప్లే, పలు మోడ్‌లు

లంచ్ బాక్స్‌పై డిజిటల్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీని ద్వారా హీటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సులభంగా గమనించవచ్చు. అలాగే రిజర్వ్‌, ఇన్సులేష‌న్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందుగా సమయం సెట్ చేసుకునే సదుపాయం ఉండటంతో అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. భోజనం వేడిగా ఉంచుకోవడానికి ఇన్సులేష‌న్ మోడ్ కూడా ఉపయోగపడుతుంది.

45
భద్రతకు ప్రత్యేక ఫీచర్లు
Image Credit : amazon.in

భద్రతకు ప్రత్యేక ఫీచర్లు

ఈ లంచ్ బాక్స్‌లో డ్రై హీట్ ప్రొటెక్ష‌న్ సదుపాయం ఉంది. అంటే లోపల ఆహారం లేదా తేమ లేకుండా ఎక్కువసేపు హీటింగ్ జరిగే పరిస్థితుల్లో రక్షణ కల్పించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆటో ఆన్‌/ఆఫ్ సదుపాయం కూడా అందించారు. నిర్ణయించిన హీటింగ్ సైకిల్ పూర్తయిన తర్వాత అనవసరంగా వేడి చేయకుండా ఆటో ఆఫ్ అయ్యేలా రూపొందించారు. అయితే విద్యుత్ పరికరం కాబట్టి ఉపయోగిస్తున్నప్పుడు ప‌లు సూచనలను తప్పకుండా పాటించాలి.

55
ఆఫీస్, ట్రావెల్‌కు అనుకూలం
Image Credit : amazon.in

ఆఫీస్, ట్రావెల్‌కు అనుకూలం

ఈ లంచ్ బాక్స్ బరువు సుమారు 1.25 కిలోలు. క్యారీ హ్యాండిల్ ఉండటంతో ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం సులభంగా ఉంటుంది. ఆఫీస్‌లో భోజనం వేడి చేసుకోవడానికి, హాస్టల్‌లో ఉండేవారు ఆహారాన్ని వేడి చేసుకోవడానికి, ప్రయాణాల్లో వెచ్చని భోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. శుభ్రం చేసేటప్పుడు ప్రధాన ఎలక్ట్రిక్ యూనిట్‌ను నీటిలో ముంచకూడదు. లోపలి SS304 కంటైనర్‌ను మైల్డ్ డిటర్జెంట్‌తో చేతితో శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టాలి. ఉపయోగించిన తర్వాత విద్యుత్ కనెక్షన్ తొలగించి శుభ్రం చేయడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image2
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Recommended image3
Flipkart Big Billion Days 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ బిగ్ డీల్స్ వచ్చేశాయి.. ఈ బ్యాంకు కార్డులపై భారీ డిస్కౌంట్లు
Related Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved