MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate Fall: ట్రంప్ వ్యాఖ్యలతో కుదేలైన గోల్డ్ మార్కెట్..యూటర్న్ తీసుకున్న బంగారం ధరలు

Gold Rate Fall: ట్రంప్ వ్యాఖ్యలతో కుదేలైన గోల్డ్ మార్కెట్..యూటర్న్ తీసుకున్న బంగారం ధరలు

Gold Rate Fall: బంగారం కొనాలనుకునేవారికి మళ్లీ గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్ ధరలు తగ్గాయి. వెండి ధర అయితే ఒక్కసారిగా రూ.10 వేల వరకు పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : May 23 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మళ్లీ శుభవార్త
Image Credit : Getty

మళ్లీ శుభవార్త

బంగారం కొనాలనుకునేవారికి మార్కెట్ నుంచి మళ్లీ శుభవార్త వచ్చింది. గత కొన్ని వారాలుగా ఎగిసిపడిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా రెండో రోజు కూడా గోల్డ్ రేట్లు దిగిరావడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలపడటం కలిసి దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల దిశగా చర్చలు
Image Credit : iSTOCK

అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల దిశగా చర్చలు

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. కానీ ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయనే వార్తలు మార్కెట్‌లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ కొంత తగ్గినట్లు కనిపిస్తోంది.

Related Articles

Related image1
Gold Rate Hike: బ్రేకింగ్ న్యూస్..ట్రంప్ షాకింగ్ నిర్ణయంతో బంగారం ధరలకు రెక్కలు
Related image2
Gold Rate Drop: బంగారం ధరలకు బ్రేక్..కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్..
35
మార్కెట్‍పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం
Image Credit : Asianet News

మార్కెట్‍పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం

ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఇరాన్‌తో చర్చలు ముందుకు సాగుతున్నాయని, త్వరలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని ఆయన సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు అదుపులో ఉండటం కూడా గోల్డ్ రేట్ల తగ్గుదలకు కారణమైంది. 

45
రూ.1,59,060కు చేరిన మేలిమి బంగారం
Image Credit : Getty

రూ.1,59,060కు చేరిన మేలిమి బంగారం

దేశీయంగా చూస్తే రూపాయి విలువలో కనిపిస్తున్న స్వల్ప బలపాటు కూడా బంగారం ధరలను తగ్గించింది. గతంలో డాలర్ బలపడటంతో భారత మార్కెట్‌లో గోల్డ్ రేట్లు మరింత పెరిగాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి కొంత మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుతున్న ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో కూడా మార్పు కనిపిస్తోంది.

ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 మేర తగ్గి రూ.1,45,800 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.430 తగ్గి రూ.1,59,060కు చేరింది. 

55
వెండి మార్కెట్‌లో భారీ మార్పు
Image Credit : X

వెండి మార్కెట్‌లో భారీ మార్పు

వెండి మార్కెట్‌లో అయితే మరింత భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.10 వేల వరకు పడిపోయి ప్రస్తుతం రూ.2.85 లక్షల వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గడంతో వ్యాపారులు కూడా మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Drop: బంగారం ధరలకు బ్రేక్..కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్..
Recommended image2
SIP Scheme: ఆదాయం త‌గ్గిందా.? SIP నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని ఎలా తగ్గించుకోవాలి?
Recommended image3
Post Office: డ‌బ్బుల‌కు డ‌బ్బులు కాయ‌డం అంటే ఇదే.. రూ. 2 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే రూ. 90 వేల లాభం
Related Stories
Recommended image1
Gold Rate Hike: బ్రేకింగ్ న్యూస్..ట్రంప్ షాకింగ్ నిర్ణయంతో బంగారం ధరలకు రెక్కలు
Recommended image2
Gold Rate Drop: బంగారం ధరలకు బ్రేక్..కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved