MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate Drop: బంగారం ధరలకు బ్రేక్..కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్..

Gold Rate Drop: బంగారం ధరలకు బ్రేక్..కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్..

Gold Rate: బంగారం ధరలు గత కొన్ని రోజులుగా సామాన్యులను భయపెడుతూనే వచ్చాయి. పెరుగుతున్న రేట్లు చూసి కొనగలమా అనే సందేహం చాలామందిలో కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎప్పటిలాగే పరుగులు తీస్తుందని భావించిన పసిడికి నేడు బ్రేక్ పడింది. 

2 Min read
Author : Nandini Arava
Published : May 22 2026, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొనుగోలుదారుల్లో చిగురించిన ఆశలు
Image Credit : Getty

కొనుగోలుదారుల్లో చిగురించిన ఆశలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచే పసిడి రేట్లు కాస్త కిందికి దిగాయి. నిన్నటి వరకు ఆకాశాన్నంటే ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో జ్యువెలరీ షాపుల్లో కూడా కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పెట్టుబడి కోసం గోల్డ్ కొనేవాళ్లు ఈ మార్పును చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి తగ్గుదలలు తరచూ రావు. ఒకసారి ధరలు తగ్గితే మళ్లీ ఎప్పుడు ఎగబాకుతాయో చెప్పడం కష్టమనే అభిప్రాయం మార్కెట్లో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రూ.1,59,490కి చేరిన మేలిమి బంగారం
Image Credit : stockPhoto

రూ.1,59,490కి చేరిన మేలిమి బంగారం

తాజా మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరపై గణనీయమైన తగ్గుదల నమోదైంది. పది గ్రాముల గోల్డ్‌పై దాదాపు రూ.440 వరకు తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.1,59,490 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం కూడా తగ్గింది. పది గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్‌పై సుమారు రూ.400 మేర తగ్గుదల రావడంతో హైదరాబాద్ మార్కెట్లో ధర రూ.1,46,200 వద్ద కొనసాగుతోంది.

33
జ్యువెలరీ షాపుల్లో మళ్లీ సందడి
Image Credit : Getty

జ్యువెలరీ షాపుల్లో మళ్లీ సందడి

కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో బంగారం కొనాలనుకున్న చాలామంది తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి కొంత అనుకూలంగా మారడంతో జ్యువెలరీ షాపుల్లో మళ్లీ సందడి మొదలైంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఈ తగ్గుదలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, భవిష్యత్తు పొదుపుల కోసం బంగారం ఇప్పటికీ అత్యంత నమ్మకమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు.

అయితే మార్కెట్లో కనిపించే ఈ ధరలే ఫైనల్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. షోరూమ్‌లో ఆభరణాలు కొనేటప్పుడు బేసిక్ గోల్డ్ రేటుకు అదనంగా 3 శాతం జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, వృథా ఛార్జీలు కూడా కలుస్తాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కో షాపులో ధరలు, ఛార్జీలు పోల్చి చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్
Recommended image2
Jio IPO: జియో ఐపీఓ సంచలనం.. భారత్‌లో ఫస్ట్ టైమ్ 10 మిలియన్లకు పైగా దరఖాస్తులతో రికార్డు
Recommended image3
Mutual Fund SIP: కేవలం రూ. 2 వేల పెట్టుబడితో రూ. 2 కోట్లు సొంతం.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Gold Rate Hike: బ్రేకింగ్ న్యూస్..ట్రంప్ షాకింగ్ నిర్ణయంతో బంగారం ధరలకు రెక్కలు
Recommended image2
Gold Price Fall: మళ్లీ గోల్డ్ రేట్లు ఢమాల్...తులంపై ఎంత తగ్గిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved