MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Automobile
  • హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?

హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?

మారుతి సుజుకి అనగానే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అని టక్కున చెప్పేస్తారు… అదే ఈ పేరు మీనింగ్ ఏంటి అంటే మాత్రం చాలామంది చెప్పలేరు. కాబట్టి ఇక్కడ ఇండియాలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల పేర్ల వెనకున్న స్టోరీని తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 15 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ కంపెనీ పేరు వెనక ఏ అర్థం దాగుంది?
Image Credit : Gemini AI

ఏ కంపెనీ పేరు వెనక ఏ అర్థం దాగుంది?

కారు కొనేటప్పుడు మనం సాధారణంగా అది ఏ కంపెనీకి చెందినదని చూస్తాం... ఆ తర్వాతే ధర, మైలేజ్, డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ వంటి విషయాలను పరిశీలిస్తాం. అయితే మనం రోజూ చూసే కార్ల కంపెనీల పేర్ల వెనక ఆసక్తికర స్టోరీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీల పేర్లు వ్యవస్థాపకుల ఇంటిపేర్ల నుంచి వచ్చాయి... మరికొన్ని పేర్లు స్థానిక భాషల్లోని పదాల నుంచి పుట్టాయి. ఇంకొన్ని పేర్లు దేశాల మధ్య ఉన్న వ్యాపార భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచాయి. ఇలా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల పేర్లు ఎలా వచ్చాయి? వాటి మీనింగ్ ఏంటి? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతి సుజుకి అంటే అర్థమేంటి?
Image Credit : Gemini

మారుతి సుజుకి అంటే అర్థమేంటి?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరల్లో కార్లను అందించడంతో ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ కంపెనీ ఆల్టో 800, సెలెరియో, స్విప్ట్ వంటి బడ్జెట్ ప్రెండ్లీ మోడల్స్ ద్వారా సామాన్యులను కార్లను అందుబాటులోకి తెచ్చింది మారుతి సుజుకి.

అయితే ఈ కంపెనీ రెండు దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యానికి నిదర్శనం. ఈ పేరులో ‘మారుతి’ అనేది భారతీయ పదం... సంస్కృతంలోని ‘మారుత్’ అనే పదంతో ముడిపడి ఉంది. మారుత్ అంటే వాయుదేవుడిని సూచించే పదం... అంటే వేగానికి సూచిక అన్నమాట. మరోవైపు ‘సుజుకి’ అనేది జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీ పేరు. భారతదేశంలో మారుతి, జపాన్‌కు చెందిన సుజుకి మధ్య ఏర్పడిన భాగస్వామ్యానికి ప్రతిబింబంగానే ‘మారుతి సుజుకి’ అనే పేరు నిలిచింది. అంటే ఈ పేరు కేవలం ఒక బ్రాండ్ పేరు మాత్రమే కాదు.. భారతీయ, జపనీస్ ఆటోమొబైల్ రంగాల కలయికకు గుర్తుగా కూడా చూడవచ్చు.

35
హ్యుందాయ్ అంటే..?
Image Credit : stockPhoto

హ్యుందాయ్ అంటే..?

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కూడా భారతీయ కార్ల మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ పేరు కొరియన్ భాషలోని ‘హ్యోండే’ అనే పదం నుంచి వచ్చింది... దీని అర్థం ‘ఆధునికత’ లేదా ‘సమకాలీనత’ అని. ఆటోమొబైల్ రంగంలో కొత్త టెక్నాలజీ, ఆధునిక డిజైన్, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టే కంపెనీ లక్ష్యానికి ఈ పేరు సరిపోయేలా ఉంటుంది. ఈ హ్యోండే పదమే హ్యుందాయ్ గా మారింది. కాబట్టి హ్యుందాయ్ అనే పేరును కేవలం ఒక కంపెనీ గుర్తింపుగా కాకుండా ఆధునికతను సూచించే పేరుగా కూడా అర్థం చేసుకోవచ్చు.

45
టాటా, మహింద్రా, హొండా... ఇవన్నీ ఇంటి పేర్లే
Image Credit : X@TataMotors_Cars

టాటా, మహింద్రా, హొండా... ఇవన్నీ ఇంటి పేర్లే

టాటా మోటార్స్

భారతదేశానికి చెందిన టాటా మోటార్స్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌తో ఈ పేరు ముడిపడి ఉంటుంది. ‘టాటా’ అనేది టాటా కుటుంబం ఇంటిపేరు. ముఖ్యంగా టాటా గ్రూప్‌కు పునాది వేసిన జంషెడ్జీ టాటా పేరు భారత పారిశ్రామిక చరిత్రలో ఎంతో ప్రముఖమైనది. అదే కుటుంబ పేరు తర్వాత అనేక రంగాల్లో విస్తరించి పెద్ద బ్రాండ్‌గా మారింది.

‘మోటార్స్’ అనే పదం కంపెనీ మోటారు వాహనాల తయారీ రంగంలో పనిచేస్తుందనే విషయాన్ని సూచిస్తుంది. అందువల్ల ‘టాటా మోటార్స్’ అనే పేరు వెనుక కుటుంబ వారసత్వం, ఆటోమొబైల్ రంగం రెండూ కలిసి కనిపిస్తాయి.

మహీంద్రా

మహీంద్రా కూడా భారతదేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ. ముఖ్యంగా SUVలు, వాణిజ్య వాహనాలు, ఇతర ఆటోమొబైల్ ఉత్పత్తులతో ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. ‘మహీంద్రా’ అనే పేరు సంస్థ వ్యవస్థాపకులైన జగదీష్ చంద్ర మహీంద్రా, కైలాష్ చంద్ర మహీంద్రా సోదరుల ఇంటిపేరు నుంచి వచ్చింది. వారి కుటుంబ పేరే తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆటోమొబైల్ బ్రాండ్‌గా మారింది.

ఈ కంపెనీ అసలుపేరు ‘మహింద్రా & మహీంద్రా’... ఇది సంస్థలోని భాగస్వామ్యం, సహకార నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే మహీంద్రా పేరు భారతీయ పారిశ్రామిక చరిత్రతో కూడా బలంగా అనుసంధానమై ఉంది.

హోండా 

జపాన్‌కు చెందిన హోండా పేరు ప్రపంచవ్యాప్తంగా కార్లు, ద్విచక్ర వాహనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ పేరుకు పెద్దగా రహస్యమేమీ లేదు. ‘హోండా’ అనేది కంపెనీ వ్యవస్థాపకుడు సోయిచిరో హోండా ఇంటిపేరు.

సోయిచిరో హోండా 1946లో ఈ కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత హోండా ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. నాణ్యత, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టిన సంస్థగా హోండాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అంటే మనం కారుపై చూసే ‘Honda’ అనే పేరు వాస్తవానికి ఆ కంపెనీని స్థాపించిన వ్యక్తి కుటుంబ పేరునే సూచిస్తుంది.

55
టయోటా.. అదృష్టం కోసం పేరు మార్చారా?
Image Credit : Toyota

టయోటా.. అదృష్టం కోసం పేరు మార్చారా?

జపాన్‌కు చెందిన టయోటా పేరు వెనుక ఉన్న కథ మిగతా బ్రాండ్ల కంటే కొంత ఆసక్తికరంగా ఉంటుంది. కంపెనీ వ్యవస్థాపక కుటుంబం ఇంటిపేరు ‘టయోడా’ (Toyoda)… అయితే కంపెనీ బ్రాండ్ పేరును ‘టయోటా’ (Toyota)గా మార్చారు. దీనికి జపనీస్ భాషలో ‘టయోటా’ అనే పేరును రాయడానికి ఉపయోగించే అక్షరాల సంఖ్య, అలాగే ఎనిమిది అనే సంఖ్యకు అదృష్టంగా భావించడమే కారణంగా చెప్పవచ్చు.

జపాన్ సంస్కృతిలో ఎనిమిది సంఖ్యను శుభప్రదంగా భావించే సంప్రదాయం ఉంది. దీంతో ‘Toyoda’ కంటే ‘Toyota’ అనే పేరు బ్రాండ్‌కు మరింత అనుకూలంగా ఉంటుందని భావించారు. ఇలా ఒక చిన్న పేరు మార్పు తర్వాత ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘Toyota’ అనే బ్రాండ్ పేరు స్థిరపడింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Best Automatic Cars : క్లచ్ నొక్కి గేర్లు మార్చాల్సిన పనేలేదు.. రూ.10 లక్షల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే
Recommended image3
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Related Stories
Recommended image1
Best Automatic Cars : క్లచ్ నొక్కి గేర్లు మార్చాల్సిన పనేలేదు.. రూ.10 లక్షల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే
Recommended image2
Maruti EV Car : సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ నాన్ స్టాప్ ప్రయాణమా..! ధర కేవలం రూ.10 లక్షలేనా!!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved