MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?

FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?

పాత కారు అమ్మేశాక ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కొత్త ఓనర్ వెళ్లే టోల్ గేట్ల దగ్గర మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఫాస్టాగ్ ఎలా క్లోజ్ చేయాలి? బ్యాలెన్స్ డబ్బులు ఎలా వెనక్కి తీసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 16 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాస్టాగ్ క్లోజ్ చేయలేదో.. అంతే సంగతి
Image Credit : Gemini AI

పాస్టాగ్ క్లోజ్ చేయలేదో.. అంతే సంగతి

FASTag Closure : పాత కారు అమ్మేయడం అంటే మొత్తం పేమెంట్ పూర్తవడం... ఆర్సీ, ఇతర డాక్యుమెంట్లు కొత్త ఓనర్ పేరు మీదకు మారిపోతే పని అయిపోయిందని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతారు. అదే మీ కార్ కు ఉన్న ఫాస్టాగ్ (FASTag) క్లోజ్ చేయడం. ఇది చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అనవసరంగా డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి.

మీరు కారు అమ్మేశాక కూడా ఫాస్టాగ్ యాక్టివ్ గా ఉంటే, కొత్త ఓనర్ టోల్ గేట్ దాటిన ప్రతిసారీ మీ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అవుతాయి. ఇలా వరుసగా డబ్బులు కట్ అయ్యాకే, తమ ఫాస్టాగ్ ఇంకా పనిచేస్తుందన్న విషయం చాలామందికి అర్థమవుతుంది. కాబట్టి కారును కొనుగోలుదారులకు అప్పగించే సమయంలోనే ఫాస్టాగ్ ను క్లోజ్ చేయడం ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫాస్టాగ్ ఎందుకు డీయాక్టివేట్ చేయాలి?
Image Credit : X

ఫాస్టాగ్ ఎందుకు డీయాక్టివేట్ చేయాలి?

ఫాస్టాగ్ అనేది కారు ముందు అద్దంపై అతికించే ఒక స్టిక్కర్. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఉంటుంది. ఈ ట్యాగ్ మీ బ్యాంక్ అకౌంట్ లేదా ఫాస్టాగ్ వాలెట్ కు లింక్ అయి ఉంటుంది. టోల్ ప్లాజా గుండా వెళ్లినప్పుడు అక్కడి స్కానర్ ఈ ట్యాగ్ ను స్కాన్ చేసి, ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తుంది. కారు అమ్మేశాక కూడా మీరు ఫాస్టాగ్ క్లోజ్ చేయకపోతే, ఈ సిస్టమ్ అలాగే పనిచేస్తుంది. కాబట్టి కొత్త ఓనర్ చేసే ప్రయాణాలకు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ ఉంది.

34
కారు అమ్మగానే ముందు ఈ పని చేయండి.
Image Credit : X

కారు అమ్మగానే ముందు ఈ పని చేయండి.

ఎవరైనా తమ వాహనాన్ని అమ్మినా లేదా వేరే వాళ్లకు ఇచ్చినా, పాత ఓనర్ వెంటనే ఫాస్టాగ్ ఇచ్చిన బ్యాంకుతో మాట్లాడి ఆ అకౌంట్ లేదా వాలెట్ ను క్లోజ్ చేయాలి. ఆ తర్వాత కొత్త ఓనర్ తన పేరు మీద కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలి. అయితే ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేసే ముందు, మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండి. డబ్బులు మిగిలి ఉంటే వాటిని ఎలా వెనక్కి తీసుకోవాలో సంబంధిత బ్యాంకును అడగండి. ఒక్కో బ్యాంకు రూల్స్ బట్టి రీఫండ్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది. అందుకే ఫాస్టాగ్ అకౌంట్ క్లోజ్ చేయడానికి అప్లై చేసేటప్పుడే, డబ్బులు వెనక్కి తీసుకునే విధానం గురించి కూడా అడిగి తెలుసుకోవడం మంచిది.

44
ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయడం ఎలా?
Image Credit : AI Generated Image

ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయడం ఎలా?

ముందుగా మీ ఫాస్టాగ్ ఏ బ్యాంకు ఇచ్చిందో చూసుకోండి. ఆ తర్వాత ఆ బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి లేదా ఆన్లైన్ ఫాస్టాగ్ పోర్టల్ ద్వారా అకౌంట్ క్లోజ్ చేయడానికి అప్లై చేయొచ్చు. కారు అమ్మేశానని, ఫాస్టాగ్ అకౌంట్ క్లోజ్ చేయాలని బ్యాంకుకు స్పష్టంగా చెప్పండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి డీటెయిల్స్ బ్యాంకు అడుగుతుంది. అన్నీ చెక్ చేశాక, మీ ఫాస్టాగ్ ను డీయాక్టివేట్ చేస్తారు.

అప్లై చేశాక, మీ ఫాస్టాగ్ నిజంగానే క్లోజ్ అయిందో లేదో నిర్ధారించుకోండి. ఒకవేళ బ్యాంకు ద్వారా ఈ సమస్య పరిష్కారం కాకపోతే, ఫాస్టాగ్ కంప్లైంట్స్, హెల్ప్ కోసం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్
Recommended image2
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image3
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Related Stories
Recommended image1
FASTag మంథ్లీ పాస్‌ ఎలా తీసుకోవాలి.? దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసా.?
Recommended image2
FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved