MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Automobile
  • Top 5 Electric Scooters : లైసెన్స్ లేకున్నా రాయల్ జర్నీ.. మగువల కోసం మైండ్ బ్లోయింగ్ EV స్కూటర్స్ లిస్ట్ ఇదిగో..!

Top 5 Electric Scooters : లైసెన్స్ లేకున్నా రాయల్ జర్నీ.. మగువల కోసం మైండ్ బ్లోయింగ్ EV స్కూటర్స్ లిస్ట్ ఇదిగో..!

ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే పెట్రోల్ అవసరం ఉండదని అందరికీ తెలుసు… కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదని తెలుసా? ఇలా లైసెన్స్ తో పనిలేకుండా రోడ్లపై రాయల్ జర్నీ చేసేలా, మహిళల మనసులు గెలిచేలా రెడీ చేసిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 22 2026, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళల కోసం మస్త్ మస్త్ స్కూటర్లు
Image Credit : Gemini AI

మహిళల కోసం మస్త్ మస్త్ స్కూటర్లు

ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారే కాదు ఇంటిపట్టునే ఉండే గృహిణులు కూడా టూవీలర్స్ ఉపయోగిస్తున్నారు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా స్కూటర్ వాడుతుంటారు. అయితే చాలామంది మహిళలకు స్కూటర్ నడిపేందుకు ఇష్టపడుతున్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు మాత్రం జంకుతుంటారు… ఆర్టివో ఆఫీసులో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అవుతామో, లేదో అన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంటుంది. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపైకి వచ్చే మహిళలు ట్రాఫిక్ పోలీసుల కంటబడితే అంతే సంగతి… వందలు లేదా వేలల్లో ఫైన్ కట్టాల్సిందే.

అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల రాకతో మహిళలకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ బాధ తప్పింది… ఇండియాలో లైసెన్స్ లేకుండానే నడిపే ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలానే ఉన్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. 250 వాట్స్ కంటే తక్కువ సామర్థ్యం, గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే స్కూటర్లకు లైసెన్స్ అవసరం లేదు. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ తో పనిలేకుండా మహిళలు ఈజీగా నడపగలిగే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1. ఏథర్ రిజ్టా (Ather Rizta)
Image Credit : Website/konarc

1. ఏథర్ రిజ్టా (Ather Rizta)

ఏథర్ కంపెనీకి చెందిన రిజ్టా మోడల్ ఫ్యామిలీకి, ముఖ్యంగా మహిళలకు భలే సెట్ అవుతుంది. ఇందులో అదిరిపోయే స్పేస్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇది ప్రతి రోజూ ఆఫీసులకు వెళ్లేవారికి, ఇంటి అవసరాల కోసం మార్కెట్‌కు వెళ్లడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీని మోడ్రన్ లుక్, ఈజీ హ్యాండ్లింగ్ మహిళలను ఇట్టే ఆకట్టుకుంటాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.75,000 వరకు ఉంటుంది.

35
2. ఓలా గిగ్ (Ola Gig)
Image Credit : Gemini AI

2. ఓలా గిగ్ (Ola Gig)

ఓలా కంపెనీకి చెందిన ఈ స్కూటర్ తక్కువ దూరాల ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్. మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా 112 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. మిగతా స్కూటర్ల లాగే ఇందులోనూ లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు తక్కువగా ఉండటం వల్ల మహిళలు చాలా ఈజీగా నడపొచ్చు. ఈ స్కూటర్ ధర రూ.39,999 నుంచి మొదలవుతుంది.

45
3. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube - Low Speed Variant)
Image Credit : TVS

3. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube - Low Speed Variant)

టీవీఎస్ కంపెనీ తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మహిళల భద్రత కోసం కంపెనీ ఇందులో బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చింది. దీని బరువు కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ.80,000 నుంచి ప్రారంభమవుతుంది.

55
4. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ (Hero Electric Flash LX)
Image Credit : Yulu Website

4. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ (Hero Electric Flash LX)

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ స్కూటర్ స్ట్రాంగ్ అండ్ బెస్ట్ ఆప్షన్ వెతికేవారికి సూపర్ ఛాయిస్. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైట్ మోడ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. మహిళలు దీన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీని ధర సుమారు రూ.64,000.

5. యూలు విన్ (Yulu Wynn)

యూలు విన్ చాలా కాంపాక్ట్, స్టైలిష్ స్కూటర్. మీరు సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా దూసుకెళ్లొచ్చు. బ్యాటరీని తీసి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం దీని స్పెషాలిటీ. సైకిల్ తొక్కినంత ఈజీగా దీన్ని నడపొచ్చు కాబట్టి మహిళలకు ఇది బెస్ట్ ఆప్షన్. యూలు విన్ మోడల్ ధర రూ.60,000.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest EV Car : అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది? ధర ఎంత?
Recommended image2
స్మార్ట్‌ఫోన్‌కి పెట్టే పైస‌ల‌తో ఎంచక్కా కారే కొనొచ్చు.. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image3
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Related Stories
Recommended image1
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image2
Cheapest EV Car : అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది? ధర ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved