- Home
- Astrology
- Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Vastu Tips: వాస్తు ప్రకారం ఇల్లు కొనుక్కుంటే సరిపోదు.. ఆ ఇంట్లో ఉంచే వస్తువులను కూడా వాస్తు ప్రకారమే ఉంచాలి. ముఖ్యంగా చెప్పులను ఇంటి దగ్గర ఉంచే దిశ.. మీ తలరాతనే మార్చేస్తుంది.

వాస్తు శాస్త్రం..
వాస్తు శాస్త్రం మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం తెలిసీ తెలియకుండా చేసే చిన్న తప్పులే మన జీవితాన్ని మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం రోజూ వాడే చెప్పులు, షూలలో బయటి దుమ్మూ దూళితో పాటు.. నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, చెప్పులను ఇంట్లోకి తీసుకురాకూడదని, సరైన దిశలో ఉంచాలని మన పెద్దలు చెడుత ఉంటారు. అయితే, చెప్పులు, షూల విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది? వీటిని ఏ దిశలో ఉంచితే.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..? ముఖ్యంగా ఒక దిశలో ఉంచడం వల్ల.. ఆర్థిక సమస్యలు తీరిపోయి, కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
ఇంట్లోకి చెప్పులు ఎందుకు తీసుకురాకూడదు..?
పాద రక్షలకు బయటి వాతావరణంలోని ప్రకంపలను ఆకర్షించే శక్తి ఉంటుంది. చెప్పులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల బయటి మురికితో పాటు... నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో కి ప్రవేశిస్తుంది. ఇది ఇంటి పవిత్రతను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కూడా తగ్గిపోతుంది.
ఏ దిశలలో చెప్పులు అస్సలు ఉంచకూడదు?
ఇంటి శ్రేయస్సును కాపాడుకోవడానికి కొన్ని దిశల్లో చెప్పులు, షూలు అస్సలు ఉంచకూడదు.
ఈశాన్య దిశ: ఈశాన్యం దేవతల దిశ , గురు గ్రహానికి అధిపతి. అత్యంత పవిత్రమైన ఈ దిశలో చెప్పులు ఉంచితే సానుకూల శక్తి, ఆధ్యాత్మిక శ్రేయస్సు నిలిచిపోతాయి.
ఉత్తర దిశ: ఉత్తరం సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానం. ఇక్కడ చెప్పులు ఉంచడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించి, డబ్బు కొరత ఏర్పడుతుంది.
తూర్పు దిశ: తూర్పు దిశకు అధిపతి సూర్యుడు. పాదరక్షలతో సంబంధం ఉన్న శని, సూర్యుడికి శత్రు గ్రహం. అందువల్ల తూర్పున చెప్పులు ఉంచితే ఇంట్లో కలహాలు, దురదృష్టం పెరుగుతాయి.
పూజ గది & వంటగది: ఇవి స్వచ్ఛతకు, అన్నపూర్ణా దేవికి ప్రతీకలు. ఈ ప్రాంతాల వద్దకు చెప్పులతో వెళ్లడం వల్ల పూజా ఫలం, ఇంట్లోని ఆరోగ్యకర వాతావరణం దెబ్బతింటాయి.
ప్రధాన ద్వారం: గుమ్మం ముందే చెప్పులను చెల్లాచెదురుగా ఉంచడం వల్ల లక్ష్మీదేవి ప్రవేశానికి ఆటంకం కలుగుతుంది.
చెప్పులు ఉంచడానికి సరైన దిశ ఏది?
వాస్తు నియమాల ప్రకారం పాదరక్షలను నైరుతి లేదా పడమర దిశలలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఈ దిశలలో షూ ర్యాక్ ఏర్పాటు చేసుకుని, చెప్పులను వరుసగా అమర్చుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
