Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 08.09.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మిథున రాశి ఫలాలు
వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
తుల రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థికంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.
కుంభ రాశి ఫలాలు
దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీన రాశి ఫలాలు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

