Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Jupiter Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురు గ్రహం త్వరలో సింహ రాశిలోకి ప్రవేశించనుంది. దీనివల్ల మహా విష్ణువు, సూర్యుడి అనుగ్రహంతో శక్తివంతమైన సామ్రాజ్య యోగం ఏర్పడనుంది. ఇది 3 రాశులవారికి ఊహించని లాభాలు ఇవ్వనుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

సింహ రాశిలో సామ్రాజ్య యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ గ్రహాలకు రాజు అయిన బృహస్పతి, సూర్యుడి ఆధిపత్యం ఉన్న రాశిలో సంచరించినప్పుడు లేదా ప్రత్యేక దృష్టిని పొందినప్పుడు 'సామ్రాజ్య యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారికి సమాజంలో తిరుగులేని అధికారం, ఉద్యోగంలో ఉన్నత పదవులు, ఊహించని ధనలాభం కలుగుతాయి. మహా విష్ణువు పరిపూర్ణ అనుగ్రహం, గురుడి ఆశీస్సులు కలిసి వారి జీవితాన్ని అందంగా మారుస్తాయి. మరి అక్టోబర్ నెలాఖరులో ఏర్పడనున్న ఈ సామ్రాజ్య యోగం ద్వారా రాజభోగం పొందబోయే రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి- ఉద్యోగంలో అద్భుతమైన ఎదుగుదల
మేష రాశి వారికి 5వ ఇంట్లో బృహస్పతి సంచారం జరగనుంది. ఈ సమయంలో మీ కళా నైపుణ్యాలు, తెలివితేటలు మరింత పెరిగి, ప్రతిభను చాటుకునే మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ మీకు అనుకూలంగా రావచ్చు. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుని, కీలకమైన కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. సమాజంలో మీ హోదా, గౌరవం మరింత పెరగవచ్చు. ఇంటా బయటా మీరు చేపట్టిన పనులు సానుకూలంగా సాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు, కొత్త అవకాశాలు కలిసి రావచ్చు. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది.
సింహ రాశి- మంచి ఆఫర్లు
బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ఠ, పలుకుబడి గణనీయంగా పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరగడంతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. సామ్రాజ్య యోగం ప్రభావంతో ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు కలిసి వచ్చి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంస్థల నుంచి అధిక జీతంతో ఆఫర్లు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, జీతం పెంపు వంటి ప్రయోజనాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడి, ఊహించని ధనలాభాలు అందే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి- కోటీశ్వర యోగం
ధనుస్సు రాశికి అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో సంచరించడం వల్ల ఈ రాశివారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరు చేపట్టే పనుల్లో విజయాలు సాధించి, పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనే మీ చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి, మీదే పైచేయి అవుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, కొత్త అవకాశాలు దక్కవచ్చు. ఊహించని ధనలాభాలు అందడంతో పాటు, పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలగవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడటంతో జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి.

