Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Vipreet Rajayoga: జోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటాడు. అక్కడ ఉంటూ విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీనివల్ల అదృష్టం పొందే రాశులు ఇవే..

తుల రాశి..
గురు గ్రహం కర్కాటక రాశి ఏర్పరుస్తున్న విపరీత రాజయోగం తుల రాశివారికి చాలా మేలు చేయనుంది. దీని కారణంగా, ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని అవకాశాలను పొందుతారు. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త క్లయింట్ల లభించి ఆదాయం పెరుగుతుంది. పాత అప్పులు, కోర్టు కేసుల నుంచి చిక్కులు వీడి ఉపశమనం పొందుతారు.
కుంభ రాశి..
గురు గ్రహ అనుగ్రహం కుంభ రాశివారికి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు తమ శత్రువులపై విజయం సాధిస్తారు. అప్పుల బాధ తీరుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. దీని వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసేవారు.. ఆఫీస్ పాలిటిక్స్, అనవసర పోటీని తెలివితో అధిగమిస్తారు. వ్యాపారులకు లాభాలు పెరిగి, పోటీదారులపై ఆధిక్యం సాధిస్తారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.
మకర రాశి..
గురు గ్రహ ప్రభావంతో మకర రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారికి గురు ప్రభావం వల్ల అనుకోని శుభ ఫలితాలు ఎదురవుతాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. రావాల్సిన పాత మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో పెద్దల ఆశీస్సులు, మద్దతుతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే నూతన అవకాశాలు వస్తాయి. నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయి.
సింహ రాశి..
సింహ రాశి జాతకంలో గురుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో ఈ రాశివారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. విదేశీ వ్యాపారాలు చేసే వారికి బంపర్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ కల ఈ కాలంలో నెరవేరే అవకాశం ఉంది. తల్లిగారి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
ధనుస్సు రాశి...
మీ రాశికి 8వ ఇంట్లో గురుడు ఉన్నప్పటికీ, తన శుభ దృష్టితో మిమ్మల్ని కాపాడతాడు. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రీసెర్చ్, ఇన్సూరెన్స్, టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా, గురు అనుగ్రహంతో చివరికి విజయం మిమ్మల్నే వరిస్తుంది.

