MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!

Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!

Moon Jupiter Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగాన్ని అత్యంత శక్తివంతమైన రాజయోగాల్లో ఒకటిగా భావిస్తారు. త్వరలో గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ యోగంతో 5 రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేవో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Sep 02 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గజకేసరి యోగంతో లబ్ధి పొందే రాశులు
Image Credit : Asianet News

గజకేసరి యోగంతో లబ్ధి పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి- కష్టానికి తగిన గుర్తింపు
Image Credit : AI Image

వృషభ రాశి- కష్టానికి తగిన గుర్తింపు

వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్‌ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Related image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
36
మకర రాశి- కొన్ని సమస్యలకు పరిష్కారం
Image Credit : AI Image

మకర రాశి- కొన్ని సమస్యలకు పరిష్కారం

మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి.

46
కన్య రాశి- ఆర్థిక అభివృద్ధి
Image Credit : AI Image

కన్య రాశి- ఆర్థిక అభివృద్ధి

కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పొదుపు లేదా పెట్టుబడి గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్న వారు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయవచ్చు. ఆఫీసులో మీ పనితీరు పైఅధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. భవిష్యత్ లక్ష్యాల వైపు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

56
తుల రాశి- వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు
Image Credit : AI Image

తుల రాశి- వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు

తుల రాశి వారికి గజకేసరి యోగం కుటుంబం, ఉద్యోగం, వివాహం వంటి అనేక విషయాలలో మంచి మార్పులను తీసుకురానుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఈజీగా ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాల్లో ప్రేమ, అవగాహన పెరిగి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

66
ధనుస్సు రాశి- ధనలాభం
Image Credit : AI Image

ధనుస్సు రాశి- ధనలాభం

ధనుస్సు రాశి వారికి గజకేసరి యోగం వల్ల ధనలాభం కలుగుతుంది. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి వరుసగా అవకాశాలు రావచ్చు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, లేదా ఎదురుచూస్తున్న మార్పులకు సంబంధించిన శుభవార్త అందుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు కుదరవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved