MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!

Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!

Mercury Magic: సెప్టెంబర్ నెలలో బుధుడు మూడు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. సెప్టెంబర్ 5న ఉత్తర ఫాల్గుణిలోకి, ఆ తర్వాత 13న హస్త నక్షత్రంలోకి, 21న ఇదే నక్షత్రంలో స్థాన చలనం చేయనున్నాడు. దీని కారణంగా ఈ నెలలో 5 రాశులు ధనవంతులు కానున్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 01 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి..
Image Credit : Chat gpt

మేష రాశి..

మేష రాశివారికి సెప్టెంబర్ నెలలో కొత్త ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఇక, కెరీర్, ఉద్యోగం పరంగానూ ఈ నెలలో బాగా కలిసిరానుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జీతం పెరుగుతుంది.

వ్యాపారులు, ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు. పొదుపు పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి, ఇది మీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుంభ రాశి:
Image Credit : Pixabay

కుంభ రాశి:

ఈ సెప్టెంబర్ 5 తర్వాత.. కుంభ రాశివారికి అప్పుల బాధలు తీరుతాయి. అనుకోని ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి రకరకాల మార్గాలు సుగమమవుతాయి. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చి, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రయాణాలు కలసి వస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

35
ధనుస్సు రాశి:
Image Credit : ChatGPT

ధనుస్సు రాశి:

ఈ నెలలో ధనస్సు రాశివారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. కెరీర్ లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

45
సింహ రాశి:
Image Credit : Pixabay

సింహ రాశి:

ఈ సెప్టెంబర్ నెలలో సింహ రాశివారికి పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.. కోరికలు నెరవేరుతాయి. సంపద వేగంగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున లాభాలు పొందుతారు. మీరు వేసే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి విజయపథంలో దూసుకుపోతారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం ఆనందం, శాంతితో సాగిపోతుంది.

55
కర్కాటక రాశి:
Image Credit : Getty

కర్కాటక రాశి:

ఈ నెలలో కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి బాస్‌ల నుండి ప్రశంసలు, గౌరవం పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ నాయకత్వ నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి!
Related Stories
Recommended image1
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Recommended image2
Planets Sancharam: సెప్టెంబర్ లో నాలుగు గ్రహాల మహా సంచారం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved