MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holidays: దంచికొడుతున్న భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. రెడ్ అలర్ట్ జారీ

School Holidays: దంచికొడుతున్న భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. రెడ్ అలర్ట్ జారీ

School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2026, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం
Image Credit : Chatgpt

తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అత్యంత వేగంగా బలపడి తీవ్ర తుపానుగా మారింది. గత కొన్ని గంటలుగా గంటకు 7 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు శరవేగంగా దూసుకొస్తోంది. బుధవారం రాత్రి వేళ విశాఖపట్నం-గోపాల్‌పూర్ రేవుల మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిణామంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ 6 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
Image Credit : Gemini AI

ఈ 6 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్

భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు సమాచారం ఆధారంగా మంత్రి నారా లోకేశ్ ఆరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ ఆదేశాల ప్రకారం అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలు మూతపడనున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలని ఎంఈఓలు, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

35
తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్.. 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Image Credit : Asianet News

తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్.. 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు

ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో సుమారు 20 సెంటీమీటర్ల మేర అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఉపద్రవం కళింగపట్నానికి 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారినందున విశాఖ, గంగవరం, కళింగపట్నం నౌకాశ్రయాల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చారు. రాబోయే 48 గంటల పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

45
అధికార యంత్రాంగం అలర్ట్
Image Credit : Asianet News

అధికార యంత్రాంగం అలర్ట్

ఈ అత్యవసర పరిస్థితిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖల సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలెవరూ పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, పెద్ద చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో 08942 240557 అనే హెల్ప్‌లైన్ నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

55
తెలంగాణ గోదావరి తీరంలోనూ తుపాను కల్లోలం
Image Credit : gemini

తెలంగాణ గోదావరి తీరంలోనూ తుపాను కల్లోలం

ఈ తీవ్ర తుపాను ఎఫెక్ట్ కేవలం ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణపైనా పడుతోంది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ముప్పు ఉన్నందున కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేసి, స్థానిక యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
Recommended image2
Now Playing
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
Recommended image3
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?
Related Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Flash Flood Alert: తీరం దాటుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved