వివాదాలతోనే  విజయ్ సినిమాలు మరింతగా జనాల్లోకి  దూసుకెళ్తున్నాయి. మెర్సెల్‌(అదిరింది) అంతగా విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమే అని ట్రేడ్ లో చెప్తారు.  రీసెంట్‌గా విడుదలైన సర్కార్‌ పరిస్దితి అదే. రిలీజ్ రోజు నుంచి ..ఇంకా చెప్పాలంటే రిలీజ్ కు ముందు నుంచీ ఏదో ఒక వివాదం చుట్టముడుతూనే ఉంది. రిలీజయ్యి ఈ సినిమా... కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. 

ఇక ఈ వివాదాలు చుట్టముట్టడం, తద్వారా కలెక్షన్స్ కుమ్మేయడంతో ఈ సినిమాని రీమేక్ చెయ్యాలనే ఆలోచన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కలిగిందట. అక్షయ్ కు, మురగదాస్ కు మంచి అనుబంధమే ఉంది. దాంతో స్పెషల్ గా ఓ షో వేయించుకుని ఈ సినిమాని అక్షయ్ చూడటం జరిగింది. 

అందులో విజయ్ చేసే జిమ్మిక్కులు, మ్యానరిజంలు ఆయనకు తెగ నచ్చేసాయట. ముఖ్యంగా దేశం మొత్తం మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ మోడ్ లోకి మారిపోతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమా తాను చేస్తే సందేశానికి సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. మరో ప్రక్క తాను వదిలేసిన మాస్ హీరో ఇమేజ్ లోకి మళ్లీ వెళ్లినట్లు ఉంటుంది అనిపించిందిట. దాంతో ఖిలాడి అక్షయ్ ఈ విషయమై తన సన్నిహితులతో చర్చించి..కొన్ని సన్నివేశాలు మార్చటం ద్వారా బాలీవుడ్ కు ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. 

అయితే వివాద సన్నివేశాల విషయంలో మాత్రం ఒకటికు రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుని స్క్రిప్టు రెడీ చేయాలని, తను సపోర్ట్ చేసే పార్టీని విమర్శించినట్లు ఉండకూడదనే కండీషన్ తో ఈ  ప్రాజెక్టు చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. అదే సమయంలో  సన్ నెట్ వర్క్ వారు ఈ సినిమాను చేస్తే తామే హిందీలో నిర్మిస్తామని , లేదంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తామని అక్షయ్ ప్రతినిథితో తెగేసి చెప్పారట.ఈ కొత్త ట్విస్ట్ తో ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!