కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో తనకంటూ ఒక క్రేజ్ ను మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు విజయ్. దళపతి ఈ సారి మరో పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ పై కన్నేశాడని సర్కార్ హంగామా చుస్తే అర్ధమవుతోంది. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమా తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

విజయ్ ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త పాత్రలో కనిపించనున్నాడని చెప్పవచ్చు. 'అతనొక కార్పొరేట్ మన్ స్టర్.. ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వారిని అంతం చేసి వెళతాడు'. అనే డైలాగ్ లోనే విజయ్ పాత్ర డిఫరెంట్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇక రాజకీయాలను సర్కార్ ప్లాన్ తో ఏ విధంగా మార్చాడు అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. 

ఒక మంచి సోషల్ మెస్సేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని 'కొన్ని షాట్స్ ని చూస్తుంటే అర్ధమవుతోంది. కీర్తి సురేష్ కూడా కొంచెం గ్లామర్ డోస్ ను లిమిట్స్ లో పెంచినట్లు కనిపిస్తోంది. ఇక తెలుగులో కూడా సినిమాపై అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన తుపాకీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

తెలుగులోల్ విజయ్ తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి సర్కార్ ఆ కోరికను ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.