MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు

Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో 'సింహాద్రి', 'కిక్' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు. అయితే, ఒక భారీ డిజాస్టర్ సినిమాను రిజెక్ట్ చేయడం మాత్రం ఆయన తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయమని అభిమానులు అంటుంటారు. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ డెసిషన్
Image Credit : Prabhas\Instagram

ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ డెసిషన్

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ', 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, 'బాహుబలి'కి ముందు ప్రభాస్ కథల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఆయన 'సింహాద్రి', 'ఆర్య', 'కిక్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను మిస్ చేసుకున్నారని అభిమానులు అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు. కానీ, తన కెరీర్‌లో ఒక భారీ డిజాస్టర్ సినిమాను రిజెక్ట్ చేయడం ద్వారా ప్రభాస్ అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నారని చాలామంది కొనియాడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శక్తి పీఠాల కథ - ప్రభాస్ రిజెక్షన్
Image Credit : Asianet News

శక్తి పీఠాల కథ - ప్రభాస్ రిజెక్షన్

దర్శకుడు మెహర్ రమేష్ 'కంత్రి' సినిమా తర్వాత ప్రభాస్‌కు రెండు కథలు వినిపించారట. ఒకటి 'బిల్లా', రెండోది 'శక్తి'. మెహర్ రమేష్ చెప్పిన 'శక్తి' కథ ప్రభాస్‌కు పెద్దగా నచ్చలేదు. అందులోని ఫాంటసీ ఎలిమెంట్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించకపోవడంతో, ఆయన సేఫ్‌గా స్టైలిష్ యాక్షన్ మూవీ అయిన 'బిల్లా'ను ఎంచుకున్నారు. ప్రభాస్ నిర్ణయం సరైనదేనని 'బిల్లా' సాధించిన విజయం నిరూపించింది. అందులో ప్రభాస్‌ను మెహర్ రమేష్ చూపించిన స్టైలిష్ విధానం అందరికీ నచ్చింది.

Related Articles

Related image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Related image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
35
ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్
Image Credit : Asianet News

ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్

మెహర్ రమేష్‌ను నమ్మి అదే 'శక్తి' కథను జూనియర్ ఎన్టీఆర్ ఓకే చేశారు. భారీ బడ్జెట్‌తో, శక్తి పీఠాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తారక్ కెరీర్‌లో ఇది ఒక మాయని మచ్చగా నిలిచిపోవడమే కాకుండా, నిర్మాత అశ్విని దత్‌కి భారీ నష్టాలను మిగిల్చింది. ఆ సినిమా దెబ్బకు అశ్విని దత్ ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

45
ప్రభాస్ తెలివైన నిర్ణయం
Image Credit : Prabhas\Instagram

ప్రభాస్ తెలివైన నిర్ణయం

ఒకవేళ ప్రభాస్ 'శక్తి' సినిమా చేసి ఉంటే, ఆయన కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయేదని విశ్లేషకులు భావిస్తారు. 'సింహాద్రి', 'ఆర్య' లాంటి హిట్స్ వదులుకున్నా బాధపడని అభిమానులు, 'శక్తి' వంటి డిజాస్టర్‌ను వదులుకున్నందుకు మాత్రం ప్రభాస్‌ను అభినందిస్తున్నారు.

55
కెరీర్‌కు శ్రీరామరక్ష..
Image Credit : X/The Raja Saab

కెరీర్‌కు శ్రీరామరక్ష..

మెహర్ రమేష్ ఆ తర్వాత చేసిన 'షాడో', 'భోళా శంకర్' వంటి సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో, ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్‌కు శ్రీరామరక్షగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి, ఒక్కోసారి కొన్ని సినిమాలను వదులుకోవడం కూడా కెరీర్‌లో పెద్ద ప్లస్ అవుతుందని ప్రభాస్ నిరూపించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image2
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Recommended image3
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved