'సర్కార్' కథ కాపీనే..!

కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన 'సర్కార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ కాపీ అంటూ రచయిత వరుణ్ ఆరోపణలు చేశారు. 2007లోనే 'సెంకోల్' అనే పేరుతో ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని ఆయన చెబుతున్నారు.

director Bhagyaraj on Sarkar story issue

కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన 'సర్కార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ కాపీ అంటూ రచయిత వరుణ్ ఆరోపణలు చేశారు.

2007లోనే 'సెంకోల్' అనే పేరుతో ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని ఆయన చెబుతున్నారు. మురుగదాస్ మాత్రం ఇది తన సొంత కథ అంటున్నారు. దీంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. సోమవారం నాడు వరుణ్ తనకు న్యాయం జరగాలంటూ నిర్మాతల మండలిలో ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ క్రమంలో కథ కాపీ జరిగిన మాట వాస్తవమేనని రచయితల సంఘం తరఫున సీనియర్ దర్శకుడు, రచయిత కె.భాగ్యరాజా స్పష్టం చేశారు. మరి కోర్టు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోపక్క దర్శకుడు మురుగదాస్ కథ కాపీ అని ఒప్పుకొని వరుణ్ కి రూ.30 లక్షల పారితోషికంతో పాటు టైటిల్స్ లో క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నరంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా.. ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాను విడుదల చేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios